హైదరాబాద్‌కు బిహార్‌ ఎమ్మెల్యేలు

12 Nov, 2020 17:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఐదుగురు ఏఐఎంఐఎం ఎమ్మెల్యేలు పార్టీ కేంద్ర కార్యాలయమైన హైదరాబాద్‌ దారుస్సలాం చేరుకున్నారు. బుధవారం సాయంత్రం రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ ఎయిర్‌ పోర్టు వద్ద బిహార్‌ ఎమ్మెల్యేలు అఖ్తరుల్‌ ఇమాన్, మహ్మద్‌ ఇజాహర్‌ ఆసీఫ్, షాహనవాజ్‌ ఆలం, సయ్యద్‌ రుకునుద్దీన్, అజహర్‌ నయీమీలకు హైదరాబాద్‌కు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా దారుస్సలాం చేరుకొని పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

కాగా మంగళవారం విడుదలైన బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. బీజేపీ 74, జేడీయూ 44 స్థానాల్లో గెలుపొందాయి. ఇక తేజస్వీ యాదవ్‌ నేతృత్వంలోని ఆర్జేడీ అత్యధికంగా 76 స్థానాల్లో విజయం సాధించింది. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు