మేము గెలిస్తే అందరికీ ఉచిత వ్యాక్సిన్‌

22 Oct, 2020 12:47 IST|Sakshi
ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తున్న నిర్మలా సీతారామన్‌

పాట్నా : ‘ పాంచ్‌ సూత్ర, ఏక్‌ లక్ష్య, 11 సంకల్ప’ పేరిట బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఎన్నికల మేనిఫెస్టో విడుదలైంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. భారత్‌లో కరోనా వ్యాక్సిన్‌ ట్రయిల్స్‌ పూర్తయి, పెద్ద మొత్తంలో ఉత్పత్తి మొదలవగానే బిహార్‌ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ను అందిస్తామని చెప్పారు. ఇదే తమ మొదటి ఎన్నికల హామీగా ఆమె పేర్కొన్నారు. బిహార్‌ ప్రజలకు రాజకీయ విషయాలపై పూర్తి స్థాయి అవగాహన ఉందని, పార్టీలు ఇచ్చే హామీలను వారు అర్థం చేసుకోగలరన్నారు. ఎవరైనా తమ పార్టీ మేనిఫెస్టోపై ప్రశ్నలు సంధిస్తే ఆత్మవిశ్వాసంతో బదులివ్వగలమని, అదే విధంగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోగలమని స్పష్టం చేశారు. ( అక్కడ గెలిస్తే.. అధికారం చేతికొచ్చినట్టే )

బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలోని మరికొన్ని కీలక హమీలు : 
1) రానున్న ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలు.
2) మూడు లక్షల ఉపాద్యాయ ఉద్యోగాలు.
3) ఆరోగ్య రంగంలో లక్ష ఉద్యోగాలు.
4) ఐటీ హబ్‌గా బిహార్‌ అభివృద్ధి .
5) తొమ్మిది, పై తరగతుల్లో అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఉచిత ట్యాబ్‌లు.
6) గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని 30 లక్షల మందికి ఉచిత ఇళ్లు.
7) ఇతర రాష్ట్రాలలో మృత్యువాత పడ్డ వలస కూలీ కుటుంబానికి 2 లక్షల ఎక్స్‌గ్రేషియా.
8) దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుడి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం, వారి ఇంట్లో ఒకరికి ఉద్యోగం.

మరిన్ని వార్తలు