హైదరాబాద్ నుంచి బయల్దేరిన బీహార్ ఎమ్మెల్యేలు

11 Feb, 2024 19:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: క్యాంపు రాజకీయాలకు కేంద్రంగా మారిన హైదరాబాద్ నుంచి 19 మంది బీహార్‌ ఎమ్మెల్యేలు ఆ రాష్ట్రానికి బయలుదేరారు. ఈ నెల 4 నుంచి హైదరాబాద్‌లో ఎమ్మెల్యేల శిబిరం  కొనసాగింది. రేపు బీహార్ శాసనసభలో బల నిరూపణకు ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.

జార్ఖండ్‌ రాజకీయం అయిపోగానే తెలంగాణలో బిహార్‌ రాజకీయం ప్రారంభమయిన సంగతి తెలిసిందే. రాంచీ నుంచి వచ్చిన జేఎంఎం, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన 38 మంది ఎమ్మెల్యేలు తిరిగి వెళ్లిపోగానే, బిహార్‌కు చెందిన 19 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కు చేరుకున్నారు. బీహార్‌లో ఇండియా కూట‌మి నుంచి జేడీయూనేత నితీష్‌కుమార్ బ‌య‌ట‌కు వ‌చ్చి.. ఎన్డీఏలో చేరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

బీహార్‌లో ఏర్పడిన కొత్త ప్రభుత్వం రేపు అసెంబ్లీలో బ‌ల‌నిరూప‌ణ చేసుకోనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేజార‌కుండా కాపాడుకోవాల‌ని ఏఐసీసీ భావించింది. అందుకే వెంట‌నే వారిని కాపాడే టాస్క్‌ను టీపీసీసీకి అప్పగించింది. దీంతో బీహార్ నుంచి వ‌చ్చిన ఎమ్మెల్యేల‌కు ఇబ్రహీంప‌ట్నంలోని ఓ రిసార్ట్‌లో వ‌స‌తి క‌ల్పించారు.

ఇదీ చదవండి: ఏఐసీసీకి తెలంగాణ సేఫ్ జోన్‌గా మారిందా?

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega