అసోం సీఎంగా హిమంత బిశ్వ శర్మ!

9 May, 2021 13:06 IST|Sakshi

దిస్పూర్: అస్సాం నూతన ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై సస్పెన్స్‌ వీడింది. ఆదివారం జరిగిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మను బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఈ పదవి కోసం సీనియర్‌ నేతలు సర్బానంద సోనోవాల్, హిమంత బిశ్వ శర్మ పోటీపడిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వంలో సోనోవాల్‌ ముఖ్యమంత్రిగా, శర్మ ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. మరో వైపు అసోం సీఎం సర్బానంద సోనోవాల్ రాజీనామా చేశారు. గవర్నర్‌కు తన రాజీనామా లేఖను సమర్పించారు.

ఇక సీఎంగా ఎన్నికైన బిశ్వ శర్మ అస్సామీ బ్రాహ్మణుడు. ఈశాన్య ప్రజాస్వామ్య కూటమి కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. అస్సాంలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నాయకత్వం ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది ప్రకటించలేదు. అస్సాంలో 126 అసెంబ్లీ సీట్లుండగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 60 సీట్లు గెలుచుకుంది. దాని మిత్రపక్షాలైన ఏజీపీ 9, యూపీపీఎల్‌ 6 సీట్లు దక్కించుకున్న సంగతి తెలిసిందే.
చదవండి: ఒట్టి చేతులతో వచ్చారేంటి.. సీఎస్‌పై గవర్నర్‌ ఫైర్‌

మరిన్ని వార్తలు