మద్యం మీద వచ్చే ఆదాయంపై ఆదారపడి పాలన: కేసీఆర్‌పై బండి సంజయ్‌ ఫైర్‌

24 Jan, 2023 15:12 IST|Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌: తెలంగాణలో రాజాకర్ల పాలన కొనసాగుతోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్‌ పాలన అరాచకం, అవినీతి పరంగా సాగుతోందని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలను అణచిస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్ వ్యవస్థను కేసీఆర్ అగౌరవ పరుస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. బీజేపీ ప్రత్నామ్నాయం అనే విషయాన్ని ప్రజలు గుర్తించారన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు రెండవ రోజు మంగళవారం కొనసాగాయి.

ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. దేశం గురించి ఆలోచించే పార్టీ బీజేపీ మాత్రమేనని అన్నారు. తెలంగాణ ప్రజలు అనేక సమస్యలతో సతమతమవతున్నారని అన్నారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వీటన్నింటిపై చర్చిస్తామని తెలిపారు. ప్రజాసంగ్రామ యాత్రలో కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై ప్రజలకు ఉన్న వ్యతిరేకత తెలిసిందన్నారు. మన ప్రజా సంగ్రామయాత్రను ప్రధాని మోదీ కొనియాడటం అభినందనీయన్నారు.

అంబేద్కర్ పుట్టినరోజు కాకుండా కేసీఆర్ పోడుభూముల విషయం ఎందుకు పరిష్కరించటం లేదు. రుణమాఫీ ఏమయ్యింది. 317 జీఓపై బీజేపీ పోరాటం వల్లే ఉపాధ్యాయుల బదిలీలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రాష్ట్ర ఆర్దిక పరిస్ధితి దివాలా తీసింది. జీతాలు ఇవ్వలేని దుస్థితి నెలకొంది. రూ. 5 లక్షల కోట్ల అప్పులు చేసిండు. మద్యంపై వచ్చే 40 వేల కోట్ల ఆదాయంపై ఆదారపడి పాలన సాగిస్తున్నాడు. చేసిన అప్పులు ఎలా తీర్చుతాడో కేసీఆర్ చెప్పే స్థితిలో లేడు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో తప్పుడు హామీలు ఇచ్చి మరోసారి సారి ప్రజలను మోసగించే ప్రయత్నం చేసే కుట్ర చేస్తున్నాడు కేసీఆర్’   అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

మరిన్ని వార్తలు