జగిత్యాలలో హై టెన్షన్‌.. బండి సంజయ్‌ మరోసారి అరెస్ట్‌

27 Nov, 2022 21:18 IST|Sakshi

సాక్షి, జగిత్యాల: తెలంగాణలో మరోసారి రాజకీయం హీటెక్కింది. తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో, ఒక్కసారిగా పొలిటికల్‌ హీట్‌ చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. నిర్మల్‌ వెళ్తుండగా జగిత్యాల జిల్లాలోని తాటిపల్లి వద్ద బండి సంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా బండి సంజయ్‌ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ముందు పాదయాత్రకు అనుమతి ఇచ్చి లాస్ట్‌ మినెట్‌లో ఎందుకు నిరాకరించారని డిమాండ్‌ చేశారు. అయితే, రేపటి భైంసా పాదయాత్రకు పోలీసుల అనుమతి లేకపోవడంతో అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. శాంతి భద్రతల కారణంగా పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. ఇక, బండి సంజయ్‌ను జగిత్యాల పోలీసు స్టేషన్‌కు తరలిస్తున్నట్టు సమాచారం.

ఇదిలా ఉండగా.. బండి సంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో బీజేపీ శ్రేణులు ధర్నాకు దిగారు. దీంతో, వారిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.  ఇక, ఈ ఘటనపై బీజేపీ జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణ స్పందించారు. డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తట్టుకోలేక బీజేపీని ఇలా అడ్డుకుంటున్నారు. ఇది సూర్యుడికి చేయి అడ్డుపెట్టే విధంగానే భావించాల్సి వస్తుంది. బండి సంజయ్‌ యాత్ర ప్రజల కోసం చేస్తున్న యాత్ర. ఇది ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలిపే యాత్ర అని అన్నారు. 
 

మరిన్ని వార్తలు