భయపడి బయటకొచ్చిండు కేసీఆర్‌ 

8 Dec, 2022 02:29 IST|Sakshi
ఖానాపూర్‌సభకు హాజరైన ప్రజలు, బీజేపీ కార్యకర్తలు. (ఇన్‌సెట్‌లో) ప్రసంగిస్తున్న బండి సంజయ్‌ 

కేంద్రం పేరు చెప్పి మోటార్లకు మీటర్లు పెడతావా! 

వేములవాడ, బాసరకు ఇస్తానన్న నిధులేవీ? 

కొండగట్టుకు వందకోట్లంటూ అంజన్ననూ మోసం చేస్తావా? 

ప్రజాసంగ్రామయాత్రలో బండి సంజయ్‌ 

15న కరీంనగర్‌లో ముగింపు సభ.. ముఖ్యఅతిథిగా నడ్డా

నిర్మల్‌/మల్లాపూర్‌(జగిత్యాల): ‘ప్రజాసంగ్రామ యాత్ర దె బ్బకు భయపడి బయటకొచ్చిన కేసీఆర్‌.. జగిత్యాలలో ఏదే దో వాగినవ్‌. నీ సంగతేందో చూస్తాం. ఫామ్‌హౌస్‌లో తాగి, తిని జల్సాలు చేస్తున్నవు. దళితబంధు, దళితులకు మూడెకరాల భూమి, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, నిరుద్యోగ భృతి హా మీలు ఏమయ్యాయి? పేదల పథకాలకు పైసలు ఉండవు.. కానీ, లక్షల కోట్లు దండుకోవడానికి మాత్రం పైసలుంటా యా’ అంటూ జగిత్యాలలో సీఎం కేసీఆర్‌ చేసిన ప్రసంగాన్ని తిప్పికొడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. ప్రజాసంగ్రామయాత్రలో భాగంగా బుధవారం నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండల కేంద్రంలో, జిల్లా సరిహద్దు గ్రామమైన బాదన్‌కుర్తిలో ప్రసంగించారు. యాత్ర బాదన్‌కుర్తి వద్ద జగిత్యాల జిల్లాలో ప్రవేశించింది. 

కేంద్రం పేరుచెప్పి మీటర్లు పెడతావా.. 
‘కేసీఆర్‌ వరద కాలువలకు పెట్టే మోటార్లకు మీటర్లు పెడతాడట. ఎన్నికలు వస్తే చాలు మోటార్లకు మీటర్లు అంటూ.. కేసీఆర్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. కేంద్రం పేరు చెప్పి మోటార్లకు మీటర్లు పెడదామని చూస్తున్నాడు. మోటార్లకు మీటర్లు పెడితే బయటికి గుంజుకొస్తాం. కేసీఆర్‌ ఏమైనా బిచ్చపోడా? రైతులకు ఉచిత కరెంటు ఇవ్వకుండా, తన ఫామ్‌హౌస్‌కు ఉచిత కరెంటు తీసుకుంటున్నాడు. తన ఫామ్‌హౌస్‌లో వాడే కరెంటును 30–40 గ్రామాలకు ఇవ్వవచ్చు. రూ.30–40 వేల కోట్లు డిస్కంలకు బకాయి ఉన్నాడు’ అని బండి సంజయ్‌ పేర్కొన్నారు. కేసీఆర్‌ గురువారం ఒక పెళ్లికి వెళ్లాల్సి ఉందని, ఆ పెళ్లి పేరు చెప్పుకుని ఒకరోజు ముందు జగిత్యాలలో మీటింగ్‌ పెట్టారన్నారు. 

బీఎల్‌ సంతోష్‌ గొప్పవ్యక్తి.. 
బీఎల్‌ సంతోష్‌ గొప్పవ్యక్తి అని, దేశం, ధర్మం, సమాజ శ్రేయస్సు కోసం అహర్నిశలు కష్టపడి ప్రచారక్‌గా పనిచేస్తున్నారని సంజయ్‌ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ ఓర్వలేక ఆయనపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. అయ్యకు ఇష్టమైన లిక్కర్‌ దందానే బిడ్డ కవిత చేసిందని, కవితను అరెస్టు చేస్తే... బాదనకుర్తి బ్రిడ్జి వద్ద మహిళలు ధర్నా చేయాల్నా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ యుద్ధం మొదలుపెట్టాడని, దీనికి మనం సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కాగా,  యాత్ర ముగింపు సభ ఈ నెల 15న కరీంనగర్‌లోని ఎస్సారార్‌ కళాశాల మైదానంలో నిర్వ హిస్తామని పాదయాత్ర ప్రముఖ్‌ మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. ము ఖ్యఅతిథిగా జేపీ నడ్డా వస్తున్నారని చెప్పారు.

మరిన్ని వార్తలు