తిరుపతి ఉప ఎన్నిక: పొత్తుకే పరిమితమైన జనసేన

12 Mar, 2021 19:18 IST|Sakshi

తిరుపతి ఉప ఎన్నిక బరిలో బీజేపీ

త్వరలోనే అభ్యర్థిని ప్రకటిస్తాం: బీజేపీ

సాక్షి, తిరుపతి : చిత్తూరు జిల్లా తిరుపతి పార్లమెంటు స్థానానికి త్వరలో జరగబోయే ఉప ఎన్నికలో బీజేపీ బరిలో నిలుస్తోంది. ఈ విషయాన్ని  పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మురళీధరన్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించగా..  బీజేపీ రాష్ట్ర శాఖ శుక్రవారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్  మధ్య జరిగిన నేటి సమావేశంలో, తిరుపతి పార్లమెంటు ఉపఎన్నికకు ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ నుంచి పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అభ్యర్థి వివరాలను అధిష్టానం ప్రకటిస్తుంది’’ అంటూ ట్వీట్‌ చేసింది. 

తిరుపతి ఉప ఎన్నికలో పోటీ చేయాలని జనసేన కార్యకర్తలు మొదటి నుంచి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మొదటి నుంచి తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామని జనసేన ప్రకటిస్తూ వస్తోంది. అవసరమైతే ఢిల్లీ బీజేపీ పెద్దలను కలిసి ఒప్పిస్తామని జనసేన వర్గాలు పేర్కొన్నాయి.  తిరుపతిలో బీజేపీ కంటే జనసేనకు ఎక్కువ బలం ఉందని, తమకు అవకాశం ఇస్తే తిరుపతి సీటును గెలుచుకుంటామని చెప్తూ వచ్చింది. ఈ తరుణంలో ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ నుంచి నిలబెడతామని పవన్ కల్యాణ్ ప్రకటించడం చర్చనీయాంశమైంది. తిరుపతి బరిలో జనసేన అయితే గట్టి పోటీ ఇచ్చేదని, బీజేపీకి ఎందుకు వదిలేశారని ప్రశ్నిస్తున్నారు. ఈ అనూహ్య నిర్ణయంపై పవన్ కల్యాణ్ జనసైనికులకు ఎలాంటి వివరణ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.

చదవండి: రాజకీయాల గురించి.. నేతల గురించి  మీరు మాట్లాడవచ్చా?

మరిన్ని వార్తలు