సాక్షి, హైదరాబాద్: ప్రజా సమస్యలు వినే ఓపికలేని ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని వీఆర్ఏలు వినతి పత్రం ఇస్తే.. దాన్ని వాళ్ల ముఖంపై పడేయడం సీఎం అహంకారానికి నిదర్శనమని శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. వీఆర్ఏలు.. సీఎం అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయమంటున్నారని ఆమె గుర్తు చేశారు.
తెలంగాణ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు (వీఆర్ఏలు) రాష్ట్రవ్యాప్తంగా 69 రోజులుగా దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. తమ డిమాండ్ల సాధన కోసం నిర్విరామ నిరసన కార్యక్రమాలకు దిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు శాసనసభలో ప్రకటించినట్టుగా పేస్కేల్ అమలు చేయాలని కోరుతున్నారు.
చదవండి: దీక్ష వేదికపైనే బ్లేడ్‌తో గొంతు కోసుకుని వీఆర్ఏ ఆత్మహత్యాయత్నం