ఎమ్మెల్యేగా ప్రమాణం చేసే అవకాశం కల్పించండి 

9 Sep, 2023 04:42 IST|Sakshi
గవర్నర్‌ తమిళిసైకి వినతిపత్రం ఇస్తున్న అరుణ  

గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసైకి బీజేపీ నేత డీకే అరుణ వినతి 

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం తనకు కల్పించాలని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విజ్ఞప్తి చేశారు. హైకోర్టు తీర్పు, ఈసీ ఇచ్చిన ఆదేశాల మేరకు తనతో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయించేలా చూడాలన్నారు. శుక్రవారం ఈ మేరకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు ఎమ్మెల్సీ ఏవీఎన్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎన్‌.రామచంద్రరావుతో కలిసి అరుణ వినతిపత్రం సమర్పించారు.

ఈసీ ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించిన రాజపత్రాన్ని గవర్నర్‌కు అందజేశారు. గద్వాల అసెంబ్లీ స్థానానికి సంబంధించిన పరిణామాల గురించి అడిగి తెలుసుకున్న గవర్నర్, అరుణతో ప్రమాణస్వీకారం చేయించేలా అసెంబ్లీ కార్యదర్శి, స్పీకర్‌తో మాట్లాడతానని చెప్పినట్టు బీజేపీ వర్గాల సమాచారం.

అనంతరం అరుణ మీడియాతో మాట్లాడుతూ  తన ప్రమాణానికి ఏర్పాట్లు చేయాలని రెండుసార్లు అసెంబ్లీ సెక్రటరీ, స్పీకర్‌ను కలిసేందుకు ప్రయత్నించగా వారు అందుబాటులో లేరన్నారు. దీనిపై వారి నుంచి ఎలాంటి సమాధా నం రాకపోవడంతో గవర్నర్‌ను కలిసినట్లు తెలిపారు. ఈ అంశంలో ఉద్దేశపూర్వకంగానే స్పీకర్‌ వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోందన్నారు.

మరిన్ని వార్తలు