అన్ని పార్టీల్లో కేసీఆర్‌కు కోవర్టులున్నారు.. ఈటల షాకింగ్‌ కామెంట్స్‌

25 Jan, 2023 14:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందే రాష్ట్రంలో ఎన్నికల హీట్‌ మొదలైంది. అధికార పార్టీ నేతలతో సహా ప్రతిపక్ష పార్టీల నేతలు సంచలన వ్యాఖ్యలు, విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇలాంటి తరుణంలో బీజేపీ హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ వ్యాఖ్యలు తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. 

కాగా, ఈటల రాజేందర్‌ మీడియాతో మాట్లాడుతూ.. "అన్ని పార్టీల్లోనూ కేసీఆర్‌ కోవర్టులు ఉన్నారు. 2018 ఎన్నికల్లో నాతో సహా 20 మందిని ఓడించేందుకు ప్రత్యర్థులకు కేసీఆర్‌ డబ్బులు ఇచ్చారు. ప్రపంచంలో ఏ పార్టీకి జాయినింగ్‌ కమిటీ లేదు. బీజేపీలో జాయినింగ్‌ కమిటీ పెట్టడం వల్ల పార్టీలో చేరే వారి పేర్లు లీక్‌ అవుతున్నాయి. అందుకే బీజేపీలో చేరేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు" అని ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. 

అయితే, ఈటల కామెంట్స్‌ తెలంగాణ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నారు. రానున్న కొన్ని నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈటల వ్యాఖ్యలు పొలిటికల్‌ పార్టీలను టెన్షన్‌కు గురిచేస్తున్నారు. కాగా, కేసీఆర్‌కు చెక్‌ పెట్టాలని బీజేపీ ప్లాన్స్‌ చేస్తున్న తరుణంలో కోవర్టుల విషయం బయటకు రావడం కలకలం సృష్టిస్తున్నది. ఇంతకీ బీజేపీలో ఉన్న కోవర్టులెవరు? పార్టీ అంతర్గత సమాచారాన్ని, కీలక అంశాలను కెసిఆర్ కు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నదెవరు? టీఆర్ ఎస్ పార్టీలో సుదీర్ఘంగా ఉండి బీజేపీలోకి వచ్చిన ఈటలకు కోవర్టులెవరన్న దానిపై స్పష్టత ఉందా? ఈటల లాంటి సీనియర్ ఎవరిని లక్యంగా చేసుకుని ఈ వ్యాఖ్యలు చేశారు? పార్టీలో ఈటలకు ఎవరెవరితో పొసగడం లేదు? ఇప్పుడీ అంశాలన్నీ బీజేపీలో చర్చనీయాంశమవుతున్నాయి. 

మరిన్ని వార్తలు