West Bengal Assembly Election 2021: దీదీ వర్సెస్‌ సువేందు

7 Mar, 2021 06:01 IST|Sakshi

57 మందితో బీజేపీ తొలి జాబితా

న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బరిలో ఉన్న నందిగ్రామ్‌లో ఆమెకు పోటీగా బీజేపీ సువేందు అధికారిని అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. శనివారం 57 మంది అ«భ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. మాజీ క్రికెటర్‌ అశోక్‌ దిందా, మాజీ ఐపీఎస్‌ అధికారి భారతి ఘోష్‌లకు తొలి జాబితాలో చోటు దొరికింది. 57 మంది పేర్లతో కూడిన జాబితాను పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ విలేకరుల సమావేశంలో విడుదల చేశారు. ఒక్క స్థానాన్ని మిత్రపక్షం ఏజేఎస్‌యూకి కేటాయించారు.

మార్చి 27 నుంచి ఏప్రిల్‌ 29 మధ్య ఎనిమిది దశల్లో జరగనున్న బెంగాల్‌ ఎన్నికల్లో తొలి రెండు విడతల్లో జరిగే 60 స్థానాలకు గాను 57 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేస్తూ బీజేపీ జాబితా రూపొందించింది. 2011లో ఉవ్వెత్తున ఎగసిన నిరసన ప్రదర్శనలతో మమత అధికారంలోకి రావడానికి కారణమైన నందిగ్రామ్‌ ఈ సారి ఎన్నికల్లో మళ్లీ హాట్‌ టాపిక్‌గా మారింది. 2016లో తృణమూల్‌ కాంగ్రెస్‌ తరఫున నందిగ్రామ్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన సువేందు అధికారి ఇటీవల బీజేపీలో చేరడానికి ముందు తన పదవికి రాజీనామా చేశారు.

మరిన్ని వార్తలు