తెలంగాణ బీజేపీ నేతల పనితీరుపై అధిష్టానం సీరియస్

31 Jul, 2021 18:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ బీజేపీ నేతల పనితీరుపై అధిష్టానం సీరియస్ అయ్యింది. ప్రజా సమస్యలపై సరైన రీతిలో పనిచేయడం లేదని జాతీయ బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అనుబంధ సంఘాల పనితీరుపైనా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

హుజురాబాద్‌ మాదిరిగా అన్ని నియోజకవర్గాల్లో ముఖ్యనేతలు ఎందుకు పనిచేయడం లేదని ఆయన ప్రశ్నించారు. మైనార్టీ, క్రిష్టియన్ వర్గాలను ఎందుకు దూరం పెడుతున్నారంటూ మండిపడ్డారు. హైదరాబాద్ నాయకులు గ్రామాలకు, కార్యకర్తల వద్దకు వెళ్లాలన్నారు. పోరాటం చేయకుంటే పార్టీతో పాటు నేతలకు గుర్తింపు రాదని సంతోష్‌జీ అన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు