Munugode Bypoll Result: చౌటుప్పల్‌లో అనుకున్న మెజార్టీ రాలేదు.. ఫలితం ఎలాగైనా ఉండొచ్చు: రాజగోపాల్‌ రెడ్డి

6 Nov, 2022 10:45 IST|Sakshi

సాక్షి, నల్గొండ: మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్‌ ఉత్కంఠగా సాగుతోంది. రౌండ్‌ రౌండ్‌ ముగిసే సమయానికి పార్టీల మధ్య ఆధిక్యం తారుమారవుతోంది. ముఖ్యంగా టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య టగ్‌ అఫ్‌ వార్‌ నడుస్తోంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నారు.

ఈ క్రమంలో కౌంటింగ్‌ కేంద్రం వద్ద రాజగోపాల్‌రెడ్డి నిరాశ వ్యక్తం చేశారు. కౌంటింగ్‌ కేంద్రం నుంచి ఆయన బయటకు వచ్చేశారు. సొంత మండలం చౌటుప్పల్‌లో తాను అనుకున్న మెజార్టీ రాలేదని ఆవేదన చెందారు. ఫలితం ఎలాగైనా ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. చివరి వరకు హోరాహోరి తప్పకపోవచ్చని, బాజేపీ గెలుస్తుందనే నమ్మకం ఉందన్నారు.

కాగా చౌటుప్పల్‌ మండలంలో 55,678 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీఆర్‌ఎస్‌కు 21,209...బీజేపీకి 21,174...కాంగ్రెస్‌కు 5,164 ఓట్లు పడ్డాయి. ఇక మునుగోడు కౌంటింగ్‌లో ఇప్పటి వరకు నాలుగు రౌండ్‌ల లెక్కింపు పూర్తయ్యింది. 4 రౌండ్‌లు ముగిసే సరికి  714 స్వల్ప ఓ‍ట్లతో టీఆర్‌ఎస్‌ ఆధిక్యంలో కొనసాగుతోంది. 4వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 4,854 ఓట్లు రాగా, బీజేపీకి 4,555  ఓట్లు పోలయ్యాయి.
చదవండి: ఆరు రాష్ట్రాల్లో 7 అసెంబ్లీ స్థానాల్లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

మరిన్ని వార్తలు