ప్లీజ్‌.. బీజేపీ ఏజెంట్లుగా కూర్చోండి!

21 Oct, 2021 02:45 IST|Sakshi
టీడీపీ నేత రాజారెడ్డిని కలిసేందుకు వెళుతున్న ఆదినారాయణరెడ్డి, అభ్యర్థి సురేష్‌

టీడీపీ నేతలకు బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి వేడుకోలు

అట్లూరు: వైఎస్సార్‌ జిల్లా బద్వేలులో ఈనెల 30న జరగనున్న పోలింగ్‌కు తమ పార్టీ తరఫున ఏజెంట్లుగా కూర్చోవాలంటూ టీడీపీ నాయకులను బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి వేడుకుంటున్నారు. ఏజెంట్లుగా కూర్చుంటే చాలు.. అన్నీ చూసుకుంటానంటూ ప్రాధేయపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన బుధవారం అట్లూరు మండలం గోపీనాథపురానికి చెందిన రాజారెడ్డి, కొండూరులోని బోవిళ్ల రామకృష్ణారెడ్డితో పాటు పలువురు టీడీపీ నాయకులను కలిశారు.

బీజేపీ అభ్యర్థి పనతల సురేష్‌ను వెంటబెట్టుకొని వెళ్లి.. టీడీపీ నాయకులతో మంతనాలు జరిపారు. బీజేపీ తరఫున ఏజెంట్లుగా కూర్చుంటే.. అన్ని విధాలా అండగా ఉంటామని ఆదినారాయణరెడ్డి హామీ ఇచ్చినట్లు సమాచారం.     

మరిన్ని వార్తలు