గొర్రెల పథకంలో అవకతవకలు: ఈటల

23 Sep, 2021 09:20 IST|Sakshi
మాట్లాడుతున్న బీజేపీనేత ఈటల రాజేందర్‌

సాక్షి, వరంగల్‌: గొల్ల కురుమలకోసం రూ.8వేల కోట్లు గొర్రెల పథకం కింద ఖర్చుపెట్టారని, ఇందులో అనేక అవకతవకలు జరిగాయని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ ఆరోపించారు. బుధవారం హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీలో వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన మహాదీక్షలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఏ రాజకీయ పార్టీ కూడా గొర్రెల పంపిణీలో జరిగిన అవకతవకలపై మాట్లాడటం లేదన్నారు.

గొల్లకురుమలకు రూ.31,500 వాటాధనం కడితే ఒక్కో యూనిట్‌ కింద రూ.1.25 లక్షలు గొర్రెలు ఇచ్చారని, గొర్రెలను సాదుకోలేక రూ.55 వేలకు అమ్ముకుంటే వారికి మిగిలింది రూ.13 వేలనుంచి రూ.18 వేల వరకే అన్నారు. మిగతా డబ్బులు ఎవరి పాలయ్యాయో తేల్చాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రభుత్వం ఉద్యోగాల నియామకాలు చేపట్టకుండా, కేవలం హుజూరాబాద్‌లో ఒక్క ఈటల రాజేందర్‌ను టార్గెట్‌ చేసి కుట్రలు చేస్తోందని ఆరోపించారు. దళితబంధు దళితులపై ప్రేమతో కాదని, వారి ఓట్లను కొల్లగొట్టేందుకేనని ఈటల ఆరోపించారు. 

చదవండి: 50 వేల టీచర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వాలి 

మరిన్ని వార్తలు