ఒవైసీపై హత్యాయత్నం చేసిన నిందితుడు నిర్దోషి

16 Feb, 2022 18:36 IST|Sakshi
సునీల్ భరాలా

యూపీ కార్మిక సంక్షేమ బోర్డు చైర్‌పర్సన్ సునీల్ భరాలా

సచిన్ శర్మ కుటుంబానికి అండగా ఉంటామని హామీ

న్యూఢిల్లీ:  ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై హత్యాయత్నం చేసిన సచిన్ శర్మ నిర్దోషి అని బీజేపీ నేత, ఉత్తరప్రదేశ్‌ కార్మిక సంక్షేమ బోర్డు చైర్‌పర్సన్ సునీల్ భరాలా అన్నారు. దాద్రీ ప్రాంతంలో ఉంటున్న సచిన్ శర్మ కుటుంబాన్ని బుధవారం ఆయన పరామర్శించారు. 

ఫిబ్రవరి 3న హాపూర్ సమీపంలోని టోల్ ప్లాజా వద్ద ఒవైసీపై సచిన్ శర్మ కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ప్రస్తుతం సచిన్ శర్మ జైలులో ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతడి సోదరుడు,  తల్లిదండ్రులను సునీల్ భరాలా కలిశారు. 

‘హాపూర్ కాల్పుల ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలి. నిర్దోషిని ఇలా శిక్షించకూడదు. సచిన్‌ కుటుంబ సభ్యులను కలిశాను. వారి ప్రమేయం ఉందా, లేదా అనేది ఇప్పటివరకు తేలలేదు. ఒవైసీ ఎప్పుడూ చాలా దురుసుగా, రెచ్చగొట్టేలా మాట్లాడతాడు. సచిన్ శర్మ కుటుంబానికి మేము అండగా ఉంటామని హామీ ఇచ్చామ’ని భరాలా చెప్పారు. (క్లిక్‌: ‘జెడ్‌’ భద్రత వ‍ద్దు.. ‘ఎ’ కేటగిరీ పౌరునిగా బతకనిస్తే చాలు)

గతంలోనూ హత్యాయత్నానికి పాల్పడినట్లు సచిన్ శర్మ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. తాను హిందూ మితవాద సంస్థ సభ్యుడినని చెప్పుకునే అతడు.. యూపీ ఉప ముఖ్యమంత్రి దినేష్ శర్మతో సహా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకులతో కలిసి ఫోటోల్లో కనిపించాడు. ఒవైసీపై హత్యాయత్నం కేసులో మరో నిందితుడు సహరన్‌పూర్‌కు చెందిన శుభమ్‌ అనే రైతు. (క్లిక్‌: హిజాబ్‌ ధరించిన మహిళ పీఎం అవుతారు!)

మరిన్ని వార్తలు