లింగోజిగూడలో బీజేపీ సెల్ఫ్‌గోల్‌

4 May, 2021 09:22 IST|Sakshi

ఓవర్‌ కాన్ఫిడెన్స్‌తో చేజారిన సిట్టింగ్‌ డివిజన్‌ 

అధికార పార్టీ పోటీకి దూరంగా ఉన్నా..తప్పని ఓటమి 

47కు పడిపోయిన బీజేపీ కార్పొరేటర్ల సంఖ్య  

సాక్షి, సిటీబ్యూరో: దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో దూకుడు పెంచిన బీజేపీ..హైదరాబాద్‌ గ్రాడ్యుయేట్, నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో ఓటమితో ఢీలా పడిపోయింది. తాజాగా లింగోజిగూడ డివిజన్‌ ఉప ఎన్నికల్లో ఘోరపరాజయం పాలై ఆ పార్టీ కేడర్‌ను మరింత నిరాశపర్చింది. అంతేకాదు జీహెచ్‌ఎంసీలో 48 స్థానాల్లో గెలుపొందిన బీజేపీ.. లింగోజిగూడ సిట్టింగ్‌ సీటును కోల్పోవడంతో ఆ సంఖ్య 47కు చేరింది. గత నవంబర్‌లో గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో 48 స్థానాలను బీజేపీ గెలుపొందింది. వీటిలో లింగోజిగూడ కార్పొరేటర్‌ ఆకుల రమే‹Ùగౌడ్‌ ప్రమాణ స్వీకారినికి ముందే చనిపోయారు. దీంతో ఆ స్థానానికి ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.  

లైట్‌గా తీసుకున్న బీజేపీ నేతలు  
మానవతా దృక్పథంతో లింగోజిగూడ డివిజన్‌  ఉపఎన్నికకు దూరంగా ఉంటున్నట్టు అధికార టీఆర్‌ఎస్‌  ప్రకటింంచింది.  ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సు«దీర్‌రెడ్డి నేతృత్వంలో బీజేపీ నేత రాంచందర్‌రావు సహా ఆకుల రమే‹Ùగౌడ్‌ కుటుంబ సభ్యులు, ఇతర పార్టీ పెద్దలు  మంత్రి కేటీఆర్‌ను  ప్రగతి భవన్‌లో కలిశారు. రమే‹Ùగౌడ్‌ స్థానంలో ఆయన కుమారుడు అఖిల్‌గౌడ్‌ను ఏకగ్రీవం చేసేందుకు అంగీకరించి, ఆమేరకు పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అయితే కాంగ్రెస్‌ పార్టీ పోటీలో నిలబడటంతో ఎన్నిక అనివార్యమైంది. సిట్టింగ్‌ సీటు కావడంతో బీజేపీ ప్రచారాన్ని లైట్‌గా తీసుకుంది. ఎలాగైనా గెలిచి తీరుతామనే ఓవర్‌ కాన్ఫిడెన్సే ఆ పార్టీ పుట్టిముంచింది. అంతేకాదు బీజేపీ  సీనియర్లెవరూ అభ్యర్థి తరపున ప్రచారం చేయలేదు. పోటీకి దూరంగా ఉన్న టీఆర్‌ఎస్‌ కేడర్‌ను ప్రసన్నం చేసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు.   

కాంగ్రెస్‌కు కలిసొచి్చన రేవంత్‌ ప్రచారం  
కాంగ్రెస్‌ అభ్యర్థి దర్పెల్లి రాజశేఖర్‌రెడ్డికి స్థానికంగా మంచి పట్టు ఉండటంతో పాటు తన సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉండటం ఆయ న కలిసి వచి్చంది. ఇదే సమయంలో ఓటింగ్‌కు దూరంగా ఉన్న టీఆర్‌ఎస్‌ కేడర్‌ను ప్రసన్నం చేసుకోవడంలో ఆయన ముందే సక్సెస్‌ అయ్యారు. దీంతో ఆయన గెలుపు ఈజీ అయింది.  ఎంపీ రేవంత్‌రెడ్డి ప్రచారం కూడా రాజశేఖర్‌రెడ్డి గెలుపునకు దోహదం చేసింది. జీహెచ్‌ఎంసీలో ఇప్పటి వరకు కాంగ్రెస్‌కు ఇద్దరు కార్పొరేటర్లు మాత్రమే ఉండగా, తాజాగా దర్పెల్లి విజయంతో ఆ సంఖ్య మూడుకు చేరింది.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు