బెంగాల్‌ అసెంబ్లీలో గందరగోళం

3 Jul, 2021 03:44 IST|Sakshi
అసెంబ్లీకి వస్తున్న గవర్నర్, పక్కనే సీఎం మమత

ప్రారంభ ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసిన గవర్నర్‌

ఎన్నికల అనంతర హింసపై బీజేపీ ఎమ్మెల్యేల నిరసనలు

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. శుక్రవారం గవర్నర్‌ జగ్దీప్‌ ధన్‌కర్‌ బీజేపీ సభ్యుల నిరసనల మధ్య తన ప్రసంగాన్ని మధ్యలోనే ముగించారు. కొత్తగాఎన్నికైనఅసెంబ్లీలో గవర్నర్‌ ధన్‌కర్‌ ప్రసంగం శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు మొదలైంది. ప్రసంగంలో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల ప్రస్తావన లేదంటూ ప్రధాన ప్రతిపక్ష బీజేపీ సభ్యులు పోస్టర్లు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ పోడియం వద్దకు చేరుకుని, నినాదాలకు దిగారు.

ఆందోళనలు తీవ్ర స్థాయికి చేరటంతో ఆయన 2.04 గంటలకు ప్రసంగాన్ని ఆపేసి, బయటకు వెళ్లిపో యారు. అనంతరం ప్రతిపక్ష నేత సువేందు అధికా రి మీడియాతో మాట్లాడుతూ..మరో మార్గం లేకనే ఆందోళనకు తాము దిగాల్సి వచ్చిందంటూ గవర్నర్‌ ప్రసంగ పాఠం ఉన్న ప్రతులను చూపారు. ‘కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక మహిళలపై ఎలాం టి హింస, అత్యాచారం, దాడి జరగలేదంటూ అధికార టీఎంసీ చెప్పుకుంటోంది.  నిజాలను దాచిపెడుతోంది. అందుకే, నిరసన తెలిపాం’అని పేర్కొన్నారు. కాగా, ఢిల్లీలోసువేందు అధికారితో భేటీ అయిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను తొలగించాలంటూ తృణమూల్‌ కాంగ్రెస్‌ శుక్రవారం ప్రధానిమోదీకి లేఖ రాసింది.

మరిన్ని వార్తలు