లక్షా 35 వేల  ఉద్యోగాల భర్తీ ఎప్పుడు?

30 Dec, 2020 13:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ :  ఏపీలో మాదిరిగా తెలంగాణలో ఉద్యోగస్తులకు ఐఆర్ ప్రకటించాలని ఎమ్మెల్సీ రామచందర్ రావు డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన  ఈ సందర్భంగా కేసీఆర్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గతంలో పీఆర్సీ ఇచ్చే వరకు ఐఆర్ ఇచ్చేవారని, ఆగస్టులోనే  పీఆర్సీ నివేదిక ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు ఇవ్వలేదని పేర్కొన్నారు. కేంద్రం మూడు డీఏలు ఇస్తే కేసీఆర్‌ ప్రభుత్వం ఒక డీఏ మాత్రమే ఇచ్చిందన్నారు. 

2018 నుంచి పీఆర్సీ అమలు కావాల్సి ఉందని, పక్క రాష్ట్రం 27 శాతం ఐఆర్ ఇస్తుందని పేర్కొన్నారు. 'తెలంగాణ వచ్చాక పదోన్నతులు, కొత్త నియామకాలు లేవు. లక్షా 35 వేల ఖాళీలు ఉన్నాయని చెబుతున్నారు..ఎప్పుడు భర్తీ చేస్తారు? నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి సహా ఉద్యోగస్తులకు రావాల్సిన ఒక్క బెనిఫిట్స్ కూడా తెలంగాణ ప్రభుత్వం ఇవ్వలేదు. కారుణ్య నియామకాలు కూడా చేపట్టడం లేదు' అని రామచందర్ రావు మండిపడ్డారు.  సీఎం కేసీఆర్‌కు  చిత్తశుద్ధి ఉంటే ఎంఈవో పోస్టులను భర్తీ చేయాలని పేర్కొన్నారు. (కేసీఆర్‌ను గద్దెదించుతాం: కోమటిరెడ్డి )


 

>
మరిన్ని వార్తలు