కవిత, కేటీఆర్‌ జైలుకు వెళ్లడం ఖాయం 

23 Sep, 2022 02:58 IST|Sakshi

బీజేపీ ఎంపీ అర్వింద్‌ 

సాక్షి, న్యూఢిల్లీ: రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ కవిత, మంత్రి కేటీఆర్‌లు జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ వ్యాఖ్యానించారు. తెలంగాణ బీజేపీ నేతలు జోకర్లు.. అంటూ మంత్రి కేటీఆర్‌ చేసిన ట్వీట్‌పై స్పందించిన ఆయన.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితలపై ధ్వజమెత్తారు. గురువా రం ఢిల్లీలోని తన నివాసంలో అర్వింద్‌ మీడియాతో మాట్లాడుతూ, దేశంలో హిందువులను చంపడానికి కుట్రలు పన్నుతున్న పీఎఫ్‌ఐ సంస్థను కేసీఆర్‌ ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.

లిక్కర్‌ స్కాంలో కవిత, ఫీనిక్స్‌ సంస్థ, ఇతర బిల్డర్లపై జరిగిన దాడుల వ్యవహారంలో కేటీఆర్‌ అరెస్ట్‌ అవుతారన్నారు. డ్రగ్స్‌ తీసుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న కేటీఆర్‌ వ్యాఖ్యలను తాము పట్టించుకోబోమన్నారు. కేటీఆర్‌కు నార్కోటిక్‌ పరీక్ష చేయాలని డిమాండ్‌ చేశారు. కేటీఆర్‌.. బీజేపీ నేతలను జోకర్లు అనే ముందు తన తండ్రి కేసీఆర్‌ థర్డ్‌ క్లాస్‌ బ్రోకర్‌ అని తెలుసుకోవాలన్నారు. కా జీపేట కోచ్‌ ఫ్యాక్టరీకి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ భూ మి ఇవ్వలేదని తెలిపారు. 4 రోజుల్లో కవితను ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో విచారణకు పిలిచి అరెస్ట్‌ చేస్తారని అన్నారు. తెలంగాణ జైళ్ల శాఖ.. కేటీఆర్, కవితల కోసం జైలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. 

మరిన్ని వార్తలు