ఈటలపై అక్కసుతోనే కేసీఆర్‌ రాజకీయాలు: ఎంపీ అరవింద్‌

1 May, 2021 14:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ప్రజలు ఆక్సిజన్, రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు, డాక్టర్ల కొరతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే సీఎం కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ మండిపడ్డారు. ఈటలపై అవినీతి ఆరోపణలపై కేసీఆర్ కుంభకర్ణుడి నిద్ర లేచి.. విచారణకు ఆదేశించడం హాస్యాస్పదమన్నారు. అవినీతి ఆరోపణలు ఉన్న టీఆర్‌ఎస్‌ నేతలందరిపై సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

మంత్రి ఈటల గ్రాఫ్ క్రమంగా పెరుగుతోందనే అక్కసుతోనే ఆయనపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ధ్వజమెత్తారు.  ఈటలపై కేసీఆర్‌ రాజకీయ ప్రతీకారం కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మై హోం రామేశ్వరరావు అక్రమాలపై సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడంలేదని ఆయన ప్రశ్నించారు.  ప్రజాస్వామ్యంలో ఈటలకో న్యాయం? జూపల్లికో న్యాయమా అంటూ ఎంపీ ప్రశ్నించారు. పేద ప్రజల భూదాన్ భూముల్లో ఫ్యాక్టరీలు, అటవీ భూముల్లో మైనింగ్‌లపై కేంద్రం మూడు సార్లు నోటీసులు ఇచ్చినా ఎందుకు స్పందించడం లేదంటూ ఎంపీ అరవింద్‌ నిలదీశారు.
చదవండి: ఈటలకు భారీ షాక్‌.. వైద్యారోగ్య శాఖ నుంచి తొలగింపు 
పక్కా ప్లాన్ ప్రకారమే నాపై కుట్ర: ఈటల రాజేందర్‌

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు