టీఎంసీ వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ ఎంపీ లాకెట్‌ ఛటర్జీ

27 Sep, 2021 20:20 IST|Sakshi

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో  భారతీయ జనాతా పార్టీ, తృణముల్‌ కాంగ్రెస్‌ పార్టీల మధ్య ట్విటర్‌ వేదికగా విమర్శల పర్వం కొనసాగుతోంది.  భబానీపూర్‌ జరిగిన ఉప ఎన్నికలలో బీజేపీ ఎంపీ లాకెట్‌ ఛటర్జీపై  టీఎంసీ నేతలు విమర్శలు గుప్పించారు. కాగా, భవానీపూర్‌లో జరిగిన ఉపఎన్నికల ప్రచారంలో బీజేపీ ఎంపీ లాకెట్‌ ఛటర్జీ ఉద్దేశ పూర్వకంగా దూరంగా ఉన్నారని  ఆరోపణలు చేశారు.

ఇప్పటికే టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్‌ ఘోష్‌... ఎంపీ లాకెట్‌ ఛటర్జీపై ట్విటర్‌ వేదికగా ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. కాగా, టీఎంసీ ఆరోపణలను బీజేపీ ఎంపీ లాకెట్‌ ఛటర్జీ ఖండించారు. భబానిపూర్‌ ఉప ఎన్నికలకు దిలీప్‌ ఘెష్‌, సువేందు అధికారి క్యాంపెయిన్‌ చేశారని తెలిపారు. తాను.. ఉత్తర ఖండ్‌ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా అక్కడ దృష్టిపెట్టానని అన్నారు.  ఈ ఉప ఎన్నికలలో 41 ఏళ్ల హైకోర్టు న్యాయవాది గ్రీన్‌ హర్న్‌ ప్రియాంక టిబ్రేవాల్‌.. మమత బెనర్జీకి వ్యతిరేకంగా బరిలో నిలబడ్డారు. ఈ ఎన్నికల ఫలితాలు అక్టోబర్‌ 3 రానున్నాయి.

చదవండి: మమతా బెనర్జీ ఇటలీ పర్యటనకు అనుమతి నిరాకరణ

మరిన్ని వార్తలు