కేంద్ర ప్రభుత్వంపై బీజేపీ నేత అసంతృప్తి

22 Feb, 2022 21:20 IST|Sakshi

ఢిల్లీ: బీజేపీ నేత వ‌రుణ్ గాంధీ మరోసారి కేంద్ర ప్ర‌భుత్వంపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీక‌ర‌ణ‌ను తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. పలు సంస్థలను ప్రైవేటీక‌ర‌ణ చేస్తే.. వాటిల్లో ఉద్యోగం చేసేవారు ఉపాధి కోల్పోతార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

‘బ్యాంకింగ్ రంగం, రైల్వేల‌ను ప్రైవేటీక‌ర‌ణ చేస్తే.. సుమారు ఐదు ల‌క్ష‌ల మంది త‌మ ఉద్యోగాల‌ను కోల్పోయారు. ఒక వ్యక్తి తన ఉపాధి కోల్పోయడంటే.. అతని కుటుంబంలోని మిగతా సభ్యులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుంది. వారి భవిష్యత్తు అంధకారంగా మారుతుంది.

ప్ర‌భుత్వాలు ప్ర‌జా సంక్షేమాన్ని పెంపొందిస్తాయి కానీ, ప్రజల్లో ఆర్థిక అస‌మాన‌త‌ల‌ను పెంచవు. పెట్టుబ‌డిదారీ విధానాన్ని ప్రోత్స‌హించ‌వు’ అని వ‌రుణ్‌ గాంధీ ట్వీటర్‌లో పేర్కొన్నారు. గతంలో వరుణ్‌ గాంధీ వ్యవసాయ చట్టాలు, లఖిమ్‌పూర్‌ ఖేరీ ఘటనలపై కేంద్రాన్ని ప్రశ్నించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు