లోతైన హృదయం ఉన్న నాయకుడి మాటలివీ

15 Oct, 2021 06:20 IST|Sakshi

వాజ్‌పేయి ప్రసంగాన్ని షేర్‌ చేసిన వరుణ్‌గాంధీ

న్యూఢిల్లీ: లఖీమ్‌పూర్‌ ఖేరిలో ఘటనలో బీజేపీ ఎంపీ వరుణ్‌గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసే చర్యలకి దిగుతున్నారు. దివంగత ప్రధానమంత్రి అటల్‌ బిహారి వాజ్‌పేయి రైతులకు మద్దతుగా మాట్లాడిన పాత వీడియో క్లిప్పుని గురువారం ఆయన ట్వీట్‌ చేశారు. 1980లో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వ రైతు అణిచివేత విధానాలను వాజ్‌పేయి ఖండిస్తూ అన్నదాతలకు అండగా ఉంటానంటూ చేసిన ప్రసంగంలో కొంత భాగాన్ని షేర్‌ చేశారు. ‘‘ప్రభుత్వం రైతుల్ని అణిచివేసినా, రైతు చట్టాలను దుర్వినియోగం చేసినా, వారు శాంతియుతంగా చేసే నిరసనల్ని అణగదొక్కినా మనం రైతు పోరాటాలకు మద్దతు ఇవ్వడానికి ఏమాత్రం సందేహించనక్కర్లేదు. వారి నుంచి దూరంగా పారిపోవాలి్సన పనిలేదు’’ అని వాజ్‌పేయి ఆ వీడియోలో పేర్కొన్నారు. లోతైన హృదయం ఉన్న నాయకుడి గొప్ప మాటలు ఇవి అంటూ  వరుణ్‌ గాంధీ కొనియాడారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు