రైతుల ఆందోళన: ఎంపీ వరుణ్‌ గాంధీ మద్దతు

5 Sep, 2021 18:47 IST|Sakshi
వరణ్‌ గాంధీ (ఫైల్‌ ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకోవచ్చని మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనకు బీజేపీ నేత, ఎంపీ వరుణ్‌ గాంధీ మద్దతు పలికారు. లక్షలాది మంది రైతులు ఆదివారం ముజఫర్‌నగర్‌లో ఒక చోటచేరి నిరసన చేపట్టారు. ‘రైతులు దేశానికి రక్త మాంసాలు. రైతులతో మర్యాద పూర్వకమైన విధానంలో చర్చలు జరుపుతాం​. రైతుల బాధను వారికోణంలోనే తెలుసుకొని, వారితో కలిసి పనిచేయడానికి ఉమ్మడి వేదికను ఏర్పాటు చేస్తాం’ అని ట్విటర్‌లో వరుణ్‌ గాంధీ పేర్కొన్నారు. 

చదవండి: జన్‌ ఆశీర్వాద యాత్రతో ప్రతిపక్షాల్లో వణుకు

దీంతో పాటు ఆయన ముజఫర్‌నగర్‌లో వందలాది రైతులు ‘కిసాన్ మహాపంచాయత్’ చేపటట్టిన నిరసన వీడియోను ట్విటర్‌లో షేర్‌చేశారు. భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ తికాయత్‌ వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకునే వరకు నిరసనలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. అయితే ఎంపీ వరుణ్‌ గాంధీ తన చేసిన ట్విట్‌లో ఎక్కడా ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని ప్రస్తావించలేదు. అయినప్పటికీ అధికారపార్టీ నుంచి రైతుల నిరసనకు మద్దతు పలికిన మొదటి నేత వరుణ్‌ గాంధీ కావటం గమనార్హం. 

చదవండి: తండ్రిపై పోలీస్‌స్టేషన్‌లో కేసు.. సమర్ధించిన ముఖ్యమంత్రి

మరిన్ని వార్తలు