బీజేపీకి భంగపాటు.. మునుగోడు ఓటమిపై సీరియస్‌ యాక్షన్‌ ప్లాన్‌ షురూ! 

7 Nov, 2022 10:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ భంగపాటుకు గురైంది. మొదటి నుంచి మునుగోడులో గెలుపు తమదే అనుకున్న కాషాయ పార్టీకి ఓటర్లు ఊహించని విధంగా షాకిచ్చారు. బీజేపీ అభ్యర్థిని రెండో స్థానానికి పరిమితం చేశారు. ఇక, అధికార టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి.. 10వేల ఓట్ల మెజార్టీతో భారీ విజయాన్ని అందుకున్నారు. కాగా, మునుగోడులో ఓటమిని బీజేపీ సీరియస్‌గా తీసుకుంది. 

ఈ నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నికపై బీజేపీ పోస్టుమార్టంకు దిగింది. ఇందులో భాగంగానే సోమవారం సాయంత్రం బీజేపీ కీలక నేతలు సమావేశం కానున్నారు. తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ అధ్యక్షతన మునుగోడు ఓటమిపై సమీక్షించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రాత్రి ముఖ్యనేతలు భేటీ కానున్నారు. ఈ భేటీకి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కూడా హాజరుకానున్నారు. 

ఇక, పోల్‌ మేనేజ్‌మెంట్‌లో బీజేపీ విఫలమైనట్టు ముఖ్య నేతలు గుర్తించారు. మరోవైపు.. మునుగోడులో ఓటు బ్యాంకు పెరిగిందని బీజేపీ శ్రేణులు సంతోషం వ్యక్తపరుస్తున్నాయి. కాగా, ప్రభుత్వ ‍వ్యతిరేకత ప్రజల్లో భారీగా ఉందని బీజేపీ నేతలు భావిస్తున్నారు.  ఎన్నికల వరకు నియోజకవర్గాల బలోపేతంపై దృష్టి సారించనున్నట్టు తెలుస్తోంది. దీంతో, కొత్త రోడ్‌ మ్యాప్‌పై బీజేపీ ఫోకస్‌ పెట్టినట్టు సమాచారం.

ఇది కూడా చదవండి: మునుగోడు ఫలితాలపై బీజేపీ చీఫ్‌ షాకింగ్‌ కామెంట్స్‌

మరిన్ని వార్తలు