లాలూ అల్లుడి రగడ.. నితీశ్‌కు కొత్త తలనొప్పి

20 Aug, 2022 07:36 IST|Sakshi

పాట్నా/గయ: బిహార్‌లో ఇటీవలే ఏర్పాటైన మహాకూటమి ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ అధికారిక సమావేశాల్లో ఆర్జేడీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ అల్లుడు శైలేష్‌ కుమార్‌ పాల్గొనడం వివాదాస్పదంగా మారింది. 

లాలూ కుమార్తె, ఆర్జేడీ రాజ్యసభ సభ్యురాలు మీసా భారతి భర్త ఈ శైలేష్‌ కుమార్‌. ఇటీవల లాలూ పెద్ద కుమారుడు, పర్యావరణ, అటవీ శాఖ మంత్రి తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌ నేతృత్వంలో జరిగిన రెండు అధికారిక భేటీల్లో అతడు పాల్గొన్నట్లు వీడియో దృశ్యాలు, ఫొటోలు శుక్రవారం బయటకు వచ్చాయి. ఈ మొత్తం వ్యవహారంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. 

మంత్రి తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌ తన అధికారిక విధులను బావ శైలేష్‌ ఔట్‌సోర్సింగ్‌కు ఇచ్చాడని బీజేపీ సీనియర్‌ నేత సుశీల్‌కుమార్‌ మోదీ ఆరోపించారు. శైలేష్‌ నేరుగా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ, అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నాడని ఆక్షేపించారు. దీనిపై ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి: ఆర్మీలో చేరాలనుకున్నా! కానీ..

మరిన్ని వార్తలు