రాహుల్‌ కొత్త పాస్‌పోర్ట్‌ ప్రయత్నం.. సుబ్రమణ్యస్వామి కౌంటర్‌ ఇదే..

24 May, 2023 13:25 IST|Sakshi

ఢిల్లీ: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విదేశీ పర్యటనకు సిద్దమయ్యారు. ఈ నెల 31 నుంచి రాహుల్‌.. పది రోజులపాటు అమెరికాలో పర్యటించనున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా, రాహుల్‌.. జూన్‌ 4న న్యూయార్క్‌లోని మాడిసన్‌ స్క్వేర్‌ గార్డెన్‌లో ఏర్పాటు చేసే బహిరంగ సభతో పాటు వాషింగ్టన్‌, కాలిఫోర్నియాలోని పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 

ఇక, రాహుల్‌ అమెరికా పర్యటన నేపథ్యంలో కొత్త పాస్‌పోర్టు కోసం ఢిల్లీ హైకోర్టును కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో సాధారణ పాస్‌పోర్టును పొందేందుకు అనుమతి(ఎన్‌వోసి) ఇవ్వాలని రాహుల్‌ బుధవారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కాగా, ఈ పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం.. మే 26(శుక్రవారం)తేదీన విచారణ జరుపనున్నట్టు స్పష్టం చేసింది. 

అయితే, మోదీ ఇంటి పేరు వ్యవహారంలో రాహుల్‌కు సూరత్‌ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. దీంతో, రాహుల్‌ తన లోక్‌సభ సభ్యత్వం కోల్పోవడం, అధికారిక బంగ్లాను ఖాళీ చేయాల్సి వచ్చింది. అందులో భాగంగానే రాహుల్‌ తన పాస్‌పోర్టు సహా అన్ని రకాల ప్రయాణ పత్రాలను సంబంధిత అధికారులు సమర్పించారు. అంతకు ముందు నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఈడీ.. రాహుల్‌ పాస్‌పోర్టును సీజ్‌ చేసింది. దీంతో ఇప్పుడు కొత్తగా సాధారణ పాస్‌పోస్టు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చింది. అందుకే కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

మరోవైపు, రాహుల్‌ గాంధీ నేషనల్‌ హెరాల్డ్ కేసులో రాహుల్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్‌ కొత్త పాస్‌పోర్టుపై కోర్టును ఆశ్రయించడంపై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి స్పందించారు. రాహుల్‌ విజ్ఞప్తిని ఆయన వ్యతిరేకించారు. ఇప్పుడు రాహుల్‌ గాంధీని విదేశాలకు వెళ్లేందుకు అనుమతిస్తే నేషనల్‌ హెరాల్డ్‌ కేసు విచారణకు ఆటంకం కలుగుతుందని సుబ్రమణ్యస్వామి తెలిపారు. పాస్‌పోర్టు ఇవ్వకపోవడమే మంచిదని పరోక్షంగా స్పష్టం చేశారు. 

ఇది కూడా చదవండి: పెద్ద నోట్ల రద్దు.. ఇంతకీ వాటిని ఏం చేశారు.. ఎక్కడున్నాయో తెలుసా?

మరిన్ని వార్తలు