రక్తం సలసల మరుగుతోంది.. కేసీఆర్‌పై బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు

27 Aug, 2022 18:48 IST|Sakshi

సాక్షి, వరంగల్‌: బీజేపీ కార్యకర్తలను కేసులతో బెదిరించలేరని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మండిపడ్డారు. హనుమకొండ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాళాల మైదానంలో బీజేపీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, బైంసాలో ఎంఐఎం కుట్రలను తట్టుకొని ధర్మం కోసం బీజేపీ కార్యకర్తలు పనిచేస్తున్నారన్నారు. బీజేపీ కార్యకర్తలు బతికినన్నాళ్లు ధర్మం కోసమే బతుకుతారన్నారు. ట్రాఫిక్‌  నిబంధనల పేరుతో బీజేపీ సభలను కేసీఆర్‌ ప్రభుత్వం అడ్డుకుంటోందని మండిపడ్డారు.
చదవండి: తెలంగాణలో నయా నిజాం వచ్చారు.. కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన జేపీ నడ్డా

‘‘బీజేపీ తెలంగాణ అభివృద్ధి కోసమే మాట్లాడుతుంది. నన్ను అరెస్ట్‌ చేసినా నా యాత్ర ఆపలేదు. కార్యకర్తలను, పార్టీ శ్రేణులను కేసులు, అరెస్టులతో ఇబ్బందులు పెట్టారు. ఎప్పుడు చస్తామో, ఎన్నాళ్లు బతుకుతామో చెప్పలేని పరిస్థితులు. కేసీఆర్‌ను వదిలే ప్రసక్తేలేదు.. రక్తం సలసల మరుగుతోంది’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అభివృద్ధి విషయంలో చర్చకు మేం సిద్ధం. కేసీఆర్ మోసాలను ప్రజలు గమనిస్తున్నారు’’ అని బండి సంజయ్‌ అన్నారు.

మరిన్ని వార్తలు