‘చెప్పులు’ మోయడంపై కేటీఆర్‌ ట్వీట్‌.. బండి సంజయ్‌ రియాక్షన్‌ ఇదే

22 Aug, 2022 18:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ అగ్రనేత అమిత్‌ షాకు తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌.. చెప్పులు అందించిన వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశారంటూ ట్విట్‌ చేశారు. దీనిపై బండి సంజయ్‌ స్పందిస్తూ.. అమిత్‌షాకు చెప్పులు అందిస్తే తప్పేముందని ప్రశ్నించారు. ప్రణబ్‌, నరసింహన్‌కు కాళ్లు మొక్కిన కేసీఆర్‌.. కోవింద్‌కు ఎందుకు మొక్కలేదు అంటూ దుయ్యబట్టారు. మేం పాదరక్షలు మాత్రమే గౌరవంతో అందిస్తామని అన్నారు. మేం గులామ్‌లు కాదు.. మజ్లిస్‌కు సలాం కొట్టే వారసులు అసలే కాదు. అవసరం తీరాక పాదాలు పట్టి లాగే అలవాటు మాకు లేదంటూ బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు.
చదవండి: తగ్గేదేలే.. బీజేపీ నేతలపై కవిత పరువు నష్టం దావా!

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో సీఎం కేసీఆర్‌ ఫ్యామిలీపై ఆరోపణలు వస్తున్నాయని.. దీనిపై కేసీఆర్‌ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. రామచంద్రపిళ్లై, అభిషేక్‌తో సంబంధాలు ఉన్నాయా? లేదా?. కుటుంబ సభ్యులపై ఆరోపణలు వస్తే కేటీఆర్‌ ఎందుకు ట్వీట్‌ చేయడం లేదు. ప్రతీ స్కాంలో కేసీఆర్‌ ఫ్యామిలీ ఉందంటూ బండి సంజయ్‌ ఆరోపించారు.

మరిన్ని వార్తలు