బీజేపీలో చేరితే దావూద్‌కూ మంత్రి పదవి: ఠాక్రే

15 May, 2022 06:01 IST|Sakshi

ముంబై: భారతీయ జనతా పార్టీపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన నేత ఉద్ధవ్‌ థాకరే మరోసారి విరుచుకుపడ్డారు. బీజేపీ నకిలీ హిందుత్వ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ఆయన శనివారం సాయంత్రం ముంబైలో భారీ బహిరంగ సభలో మాట్లాడారు. రెండేళ్ల తర్వాత బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు.

అండర్‌వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం బీజేపీలో చేరితే ఏకంగా మంత్రి పదవి కూడా ఇస్తారని ఎద్దేవా చేశారు. మహారాష్ట్ర నుంచి ముంబై నగరాన్ని వేరు చేసేందుకు బీజేపీ పన్నుతున్న కుట్రలు సాగవని హెచ్చరించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీజేపీతో తమ కూటమి విచ్ఛిన్నమయ్యాక గాడిదలను తన్ని తరిమేశామని ఉద్ధవ్‌ వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు