బీఆర్‌ఎస్‌కు ఊహించని ఎదురుదెబ్బ

12 Feb, 2024 07:43 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు దెబ్బ తగిలినా.. గ్రేటర్‌ హైదరాబాద్‌లో క్లీన్‌ స్వీప్‌ చేసిన బీఆర్‌ఎస్‌కు లోక్‌సభ ఎన్నికల ముందు ఊహించని షాక్‌ తగులుతోంది. గులాబీ దండు నుంచి అధికార కాంగ్రెస్‌లోకి వలసలు జోరందుకుంటున్నాయి. జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌ బాటలో మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు తెలుస్తోంది.ఆదివారం సాయంత్రం బొంతు రామ్మోహన్‌ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కలవడం ఇందుకు ఊతమిస్తోంది. త్వరలోనే తన అనుచరులతో కలిసి ‘కారు’ దిగి కాంగ్రెస్‌ కండువా కప్పుకోవడానికి సిద్ధమైనట్లు సమాచారం.  

చిన్నచూపు చూశారనే.. 
► విద్యార్థి దశ నుంచే ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న బొంతు రామ్మోహన్‌ బాబా ఫసియుద్దీన్‌లకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం  బీఆర్‌ఎస్‌ మొదటిసారి అధికారంలోకి వచి్చన తర్వాత బల్దియాలో మేయర్, డిప్యూటీ మేయర్‌ పదవులతో తగిన గుర్తింపును ఇచి్చంది. రెండో దఫా అధికారంలోకి వచ్చాక బీఆర్‌ఎస్‌ ఉద్యమ వీరులను చిన్నచూపు చూసిందని, అసలు లక్ష్యమే పక్కదారి పట్టిందని ఆరోపణలు వెల్లువెత్తాయి.  

► మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్‌ టికెట్‌ ఆశించి భంగపడ్డ బొంతు రామ్మోహన్‌ నాటి నుంచి పారీ్టతో అంటీ ముట్టన్నట్లుగానే ఉంటూ వస్తుండగా... మాజీ డిప్యూటీ మేయర్‌  బాబా ఫసియుద్దీన్‌ మాత్రం తనకు స్థానిక ఎమ్మెల్యేతో ప్రాణహాని ఉందని చెప్పినా బీఆర్‌ఎస్‌ అధిష్టానం పట్టించుకో లేదంటూ ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. తాజాగా బొంతు రామ్మోహన్‌ సీఎం రేవంత్‌ రెడ్డిని కలవడంతో.. ఆయన కాంగ్రెస్‌లో ఆయన చేరిక లాంఛనప్రాయమేనని తెలుస్తోంది. అధికార కాంగ్రెస్‌ కూడా నగరంలో పట్టు కోసం బీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలు, కార్పొరేటర్లను తమవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నాలు చేస్తోంది. 

కాంగ్రెస్‌ టచ్‌లో 20 మంది కార్పొరేటర్లు 
► బీఆర్‌ఎస్‌కు చెందిన సుమారు 20 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ వీడిన మాజీ మేయర్‌ బండ కార్తీక రెడ్డితో పాటు పలువురు మాజీ కార్పొరేటర్లు కూడా తిరిగి సొంత గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే డిప్యూటీ మేయర్‌ శ్రీలతా శోభన్‌ రెడ్డి దంపతులు బీఆర్‌ఎస్‌ పారీ్టపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వారు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోవచ్చనే ప్రచారం సాగుతోంది.  మరోవైపు గులాబీలు చేజారకుండా కట్టడి చేయాల్సిన బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సైతం జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్ల సమావేశంలో  పార్టీ నుంచి పోతే పోనీ.. వాళ్ల కర్మ అన్నట్లు వ్యాఖ్యానించడంతో పలువురు కాంగ్రెస్‌ బాట పడుతున్నట్లు సమాచారం. 

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega