టిడ్కో ఇళ్లపై ఆంధ్రజ్యోతి తప్పుడు రాతలు

6 Feb, 2022 05:10 IST|Sakshi

వివరణ అడిగి రాయాలన్న కనీస సంప్రదాయాన్నీ పాటించడంలేదు

మంత్రి బొత్స సత్యనారాయణ

సాక్షి, అమరావతి: టిడ్కో ఇళ్లపై ఆంధ్రజ్యోతి పత్రిక తప్పుడు వార్తలు వండి వారుస్తోందని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం మీడి యా పాయింట్‌ వద్ద శనివారం ఆయన మాట్లాడా రు. సమాచారం కావాలంటే, ప్రభుత్వ అధికారుల ను, మంత్రిగా తననైనా వివరణ అడిగి రాయాలన్న కనీస సంప్రదాయాన్ని పాటించకుండా ఇష్టం వచ్చి నట్లు అసత్యాలతో కూడిన వార్తలను రాయడం మంచి పద్ధతికాదన్నారు. పత్రిక యాజమాన్యం ఉ ద్దేశాలను, దురుద్దేశాలను టిడ్కో ఇళ్లపై రుద్ది అబ ద్ధపు వార్తలు రాయటం సరికాదని మండిపడ్డారు. 

బాబు హయాంలో లబ్ధిదారులతో భారం
ఇక టిడ్కో ఇళ్లల్లో మూడు కేటగిరీలున్నాయని.. వాటిల్లో 300 ఎస్‌ఎఫ్టీ, 365 ఎస్‌ఎఫ్టీ, 430 ఎస్‌ఎఫ్టీ ఇళ్లు నిర్మిస్తున్నట్లు మంత్రి చెప్పారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఈ ఇళ్ల రుణాలను పూ ర్తిగా లబ్ధిదారులే చెల్లించాల్సి ఉండేదన్నారు. 20 ఏళ్లపాటు అసలు, వడ్డీతో సహా కట్టాల్సి వచ్చేదని. అప్పు తీరిన తర్వాతే ఆ ఇంటిపై వారికి సర్వ హ క్కులు వచ్చేవన్నారు. కా నీ, సీఎం జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేర కు.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 300 ఎస్‌ఎఫ్టీ ఇళ్లకు ఒక్క రూపాయి కట్టించుకుని పేదలకు రిజిస్ట్రేషన్‌ చేసి పూర్తి హక్కులతో ఇస్తున్నామన్నారు.

ఇక టిడ్కో ఇళ్లు మొత్తం 2.62 లక్షలు ఉంటే.. వాటిల్లో 300 చద రపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న 1.43 లక్షల ఇళ్లను ఉచితంగా ఇచ్చి, వారిని సొంత ఇంటిదారులను చేస్తున్నామన్నారు. వారికి, ఏ అప్పులేకుండా వెంట నే సర్వహక్కులతో ఇల్లు సొంతమవుతుందని, మిగి లిన రెండు కేటగిరీలకు సంబంధించిన గృహాలను లబ్ధిదారుని పేరిట ఇచ్చే బ్యాంకు రుణాలకు ప్రభుత్వం ఫెసిలిటేటర్‌గా ఉంటుందని మంత్రి చెప్పారు. పథకం ఇంతా పక్కాగా, పేదలకు న్యాయం జరిగేలా అమలు చేస్తుంటే, లబ్ధిదారుల పేరిట రుణాలు అంటూ..ఆంధ్రజ్యోతి తప్పుడు సమాచారంతో రా తలు రాయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. లబ్ధిదారులను ఆందోళనకు గురిచేయవద్దని ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి బొత్స హితవు పలికారు.  

మరిన్ని వార్తలు