అధికారం తప్ప.. బాధ్యతలు పట్టవా..?

23 Jan, 2021 16:01 IST|Sakshi

మంత్రి బొత్స సత్యనారాయణ

సాక్షి, నెల్లూరు: ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు అధికారం తప్ప.. బాధ్యతల గురించి పట్టించుకోవడం లేదని రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. శనివారం ఆయన నెల్లూరులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఎస్‌ఈసీకీ అధికారంతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయని.. అధికారాన్ని, బాధ్యతలను సమన్వయం చేసుకోవాలని ఆయన హితవు పలికారు. ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు వ్యాక్సిన్ తప్పనిసరని ప్రధాని చెప్పారు. ప్రజారోగ్యం ప్రభుత్వానికి ప్రధాన బాధ్యత అని తెలిపారు. ఓ రాజకీయ నేతలా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారని.. వ్యక్తిగత అవసరాల కోసమే ఆయన పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజల ప్రాణాలే ముఖ్యమని ప్రభుత్వం చెబితే పట్టించుకోవడం లేదు.. రేపు ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిదని మంత్రి బొత్స ప్రశ్నించారు.(చదవండి: ఎందుకంత నియంతృత్వ పోకడ: స్పీకర్‌ తమ్మినేని

ఎవరి మెప్పు కోసం..?
‘‘గతంలో గోపాల కృష్ణ ద్వివేది ఎంత పకడ్బందిగా ఎన్నికలు నిర్వహించారో మీకు తెలుసు. నిమ్మగడ్డ రమేష్ వ్యక్తిగత స్వార్థం, పరిచయాల కోసం రాజ్యాంగాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఎవరి కోసం ఈ ఎన్నికలు. గతంలో మేము ఎన్నికలు నిర్వహించమంటే ఎందుకు పెట్టలేదు. చంద్రబాబు మీ స్నేహితుడని, సామాజిక వర్గమని ఎన్నికలు పెట్టలేదా.. ఇప్పుడు ఈ ఎన్నికలు మీకు పదవిచ్చిన చంద్రబాబు మెప్పు పొందడానికా..? చంద్రబాబుతో నిమ్మగడ్డ రమేష్ లాలూచి పడ్డారు. ఎన్నికలు మూడు నెలల వాయిదా వేయడం వల్ల ఏలాంటి నష్టం లేదు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పని చేయడం ఎంత వరకు కరెక్టు. రాజ్యంగ వ్యవస్థలో నిమ్మగడ్డ వంటి వ్యక్తులు ఉండటం చాలా దురదృష్టం. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాతే ప్రభుత్వ నిర్ణయం ఉంటుంది. రాష్ట్రంలో ప్రతి విషయానికి చంద్రబాబు అల్లకల్లోలం సృష్టిస్తున్నారని’’  మంత్రి బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు.

మరిన్ని వార్తలు