'కేవలం ఘర్షణ కోసమే అసెంబ్లీకి వచ్చారు'

5 Dec, 2020 13:51 IST|Sakshi

సాక్షి, అమరావతి : టీడీపీ సభ్యులు కేవలం ఘర్షణ కోసమే అసెంబ్లీకి వచ్చారని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి శనివారం బొత్స మీడియాతో మాట్లాడారు.' ప్రతిపక్ష నేతగా చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారు. సభా సంప్రదాయాలకు విలువ ఇవ్వకుండా అసెంబ్లీలో స్పీకర్‌ను, మండలిలో ఛైర్మన్‌ను చుట్టుముట్టారు. సభా నియమాలు పాటించకుండా బాబు పోడియం వద్ద బైఠాయించారు. స్పీకర్‌ను బెదిరించేలా అనుచితంగా మాట్లాడారు.  స్పీకర్‌పై చంద్రబాబు వ్యక్తిగత దూషణలకు దిగి సభను అపహాస్యం చేశారు. 

అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని వివరించాం. 5కోట్ల 65లక్షల మంది లబ్ధిదారులకు రూ.67వేల కోట్లు ఖర్చు చేశాం. ఏడాదిన్నర పాలనలో చేసిన సంక్షేమాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లెక్కలతో సహా చూపించారు. పోలవరం ఎత్తుపై ఎల్లో మీడియాలో తప్పుడు ప్రచారం చేశారు. అసెంబ్లీ సాక్షిగా పోలవరం ఎత్తును ఒక్క సెం.మీ కూడా తగ్గించలేదని సీఎం చెప్పారని' బొత్స తెలిపారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు