'చంద్రబాబులా ఈ ప్రభుత్వం సీబీఐకి భయపడదు'

12 Sep, 2020 15:31 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నవశకం నాయకుడిగా సీఎం జగన్‌ చరిత్రలో నిలిచిపోతారని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. తాడేపల్లిలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్‌ ఆసరా ద్వారా 90లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరింది. ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలను వైఎస్‌ జగన్‌ నెరవేర్చుతున్నారు. ప్రతిపక్ష పార్టీలు దుష్ట ఆలోచనతో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. గతంలో సీబీఐ రాష్ట్రానికి రావడానికి వీల్లేదన్న చంద్రబాబు నేడు సీబీఐ విచారణ అడుగుతున్నారు. ప్రజల్లో అపోహలు తొలగించాలని సీఎం జగన్‌ విచారణ జరిపిస్తున్నారు. చంద్రబాబులా సీబీఐకి ఈ ప్రభుత్వం భయపడదు. బాధ్యత గల ప్రభుత్వంగా వైఎస్సార్‌సీపీ వ్యవహరిస్తోంది. (చంద్రం.. మీ కుతంత్రం ఇదే కదా!)

పుష్కరాల పేరుతో 40 దేవాలయాలను చంద్రబాబు కూల్చివేశారు. పుష్కరాల సందర్భంగా భక్తుల మరణానికి చంద్రబాబు కారణమయ్యారు. చంద్రబాబు హయాంలో ఎన్ని ప్రమాదాలు సంభవించిన ఎలాంటి విచారణ జరపలేదు. దేవాలయాల్లో చంద్రబాబు పూజలు చేయాలని చెప్పడానికి సిగ్గుండాలి. దేవుడిని రాజకీయాలకు ముడిపెట్టడం చంద్రబాబు దుష్ట సంప్రదాయం. అధికారం పోయేసరికి చంద్రబాబుకు అందరూ గుర్తుకు వస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు బడాబాబులు మాత్రమే గుర్తుకు వస్తారు. దళితులపై దాడులు చేసిన వారిపై వెంటనే సీఎం జగన్‌ చర్యలు తీసుకుంటున్నారు. ఒక నేత చంద్రబాబుకు వంతపాడతారు. మరొక జాతీయ పార్టీ నేత చర్చ్‌పై రాళ్లురువ్విన వాళ్ళను విడుదల చేయాలంటున్నారు. (మరో మాట నిలబెట్టుకున్న సీఎం వైఎస్ జగన్)

రాష్ట్రంలో శాంతి భద్రతలు అవసరం లేదా..? చంద్రబాబు తన హయాంలో వైఎస్సార్ ఆసరా వంటి కార్యక్రమం ఒక్కటైనా పెట్టారా..? శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే ఉపేక్షించేది లేదు. రఘురామ కృష్ణంరాజు చౌకబారు మాటలకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. రఘురామ కృష్ణమ రాజును  రాజీనామా చేస్తే చేయమనండి. మూడు రాజధానులపై ప్రభుత్వం చట్టం చేసింది. ఆ ప్రకారం ముందుకు వెళతాం. రాజధాని వ్యవహారంలో అవినీతికి పాల్పడ్డ వారిని చట్టం తనపని తాను చేసుకుపోతుంది. అవినీతికి పాల్పడ్డ వారిని వదలి పెట్టేది లేదు' అని మంత్రి బొత్స వెల్లడించారు. 

మరిన్ని వార్తలు