సీఎం ఢిల్లీ పర్యటనపై ఎల్లోమీడియా రాద్ధాంతం చేస్తోంది: బొత్స

10 Jun, 2021 13:29 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో టీడీపీ, ఎల్లో మీడియా రాద్దాంతం చేస్తున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. '' టీడీపీకి నీచమైన ఆలోచనలు తప్ప.. సూచనలు ఇచ్చే అలవాటు లేదు. కరోనా కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం'' అని తెలిపారు.

కాగా ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం జగన్‌ కాసేపటిక్రితమే ఢిల్లీకి చేరుకున్నారు. జగన్‌ వెంట ఎంపీలు మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, బాలశౌరి, సజ్జల రామకృష్ణారెడ్డి ఉ‍న్నారు. హోంమంత్రి అమిత్‌ షా, జల వనరుల శాఖమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్, రైల్వే శాఖ మంత్రి గోయల్‌ సహా పలువురు కేంద్ర మంత్రులను సీఎం జగన్‌ కలుసుకుంటారు. పోలవరం ప్రాజెక్ట్‌ పనులు సహా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వారితో చర్చిస్తారు. సీఎం వైఎస్‌ జగన్‌ తిరిగి శుక్రవారం మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు.
చదవండి: ఢిల్లీ చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌

మరిన్ని వార్తలు