ఫిబ్రవరి 1న ఎమ్మెల్యేగా కేసీఆర్‌ ప్రమాణ స్వీకారం

28 Jan, 2024 03:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీ ఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, మా జీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఫిబ్రవరి ఒకటో తేదీన అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ సమక్షంలో గజ్వేల్‌ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తారు. రాష్ట్ర శాసనసభకు గత ఏడాది నవంబర్‌లో ఎన్నికలు జరగ్గా డిసెంబర్‌ 3న ఫలితాలు వెలువడ్డాయి. డిసెంబర్‌ 9న అసెంబ్లీ ప్రొటెమ్‌ స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కొత్త గా ఎన్నికైన వారిలో చాలా మంది ఎమ్మె ల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు.

అయితే డిసెంబర్‌ 8న ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బాత్‌రూంలో కేసీఆర్‌ జారి పడగా తుంటి ఎముకకు గాయమైంది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కేసీఆర్‌కు శస్త్ర చికిత్స జరిగింది. నాటి నుంచి కేసీఆర్‌ వైద్యుల సూ చన మేరకు విశ్రాంతి తీసుకుంటూ కోలుకుంటున్నారు. త్వరలో రాష్ట్ర రాజకీయాల్లో తిరిగి క్రియాశీలం కాబోతున్న కేసీఆర్‌ ఫిబ్రవరి 1న గజ్వేల్‌ ఎమ్మెల్యేగా ప్రమాణం స్వీకారం చేస్తారు. ఎమ్మెల్యేగా కేసీఆర్‌ ప్రమాణ స్వీకారం నేప థ్యంలో పెద్ద సంఖ్యలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి తరలిరానుండటంతో అసెంబ్లీ వర్గాలు భద్రతా ఏర్పాట్లపై దృష్టి సారించాయి.

whatsapp channel

మరిన్ని వార్తలు