రాజ్‌భవన్ వద్ద ఉద్రిక్తత.. మేయర్‌ విజయలక్ష్మి అరెస్ట్‌

11 Mar, 2023 18:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాజ్‌భవన్‌ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాజ్‌భవన్‌ గేటు ముందు బీఆర్‌ఎస్‌ నేతలు ఆందోళనకు దిగారు. బండి సంజయ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బండి సంజయ్‌ వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసేందుకు గవర్నర్‌ తమిళిసైని కలవడానికి మేయర్‌ బృందం ప్రయత్నించగా, గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ లేదని రాజ్‌భవన్‌ వర్గాలు వెల్లడించాయి. దీంతో రాజ్‌భవన్‌ వద్ద బైఠాయించి నిరసనకు దిగిన మహిళా నేతలు.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రాజ్‌భవన్‌ గోడకు వినతి పత్రం అంటించారు.
ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో మేయర్‌ విజయలక్ష్మిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

అపాయింట్‌మెంట్‌ అడిగినా గవర్నర్‌ స్పందించలేదని.. ఆమెను కలిసే వరకూ ఇక్కడే ఉంటామని మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి తేల్చి చెప్పారు. బండి సంజయ్‌.. మహిళలను అవమానించారని మేయర్‌ మండిపడ్డారు. ‘‘మహిళల పట్ల సంజయ్‌ సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు.. సంజయ్‌ను నోటిని ఫినాయిల్‌తో కడగాలి. సంజయ్‌ వ్యాఖ్యలు సమాజం తలదించుకునేలా ఉన్నాయి. బేషరతుగా మహిళలకు సంజయ్‌ క్షమాపణలు చెప్పాలని మేయర్‌ విజయలక్ష్మి డిమాండ్‌ చేశారు.
చదవండి: కవితపై అనుచిత వ్యాఖ్యలు.. బండి సంజయ్‌పై కేసు నమోదు..


 

మరిన్ని వార్తలు