నీళ్ల కోసం ఉద్యమించాల్సిందే: కేసీఆర్‌

13 Feb, 2024 18:03 IST|Sakshi

KCR Nalgonda Public Meeting Updates

నల్గొండ సభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగం

జై తెలంగాణ అంటూ ప్రసంగం ప్రారంభించిన మాజీ సీఎం కేసీఆర్‌

 • ఇది ఉద్యమ సభ, పోరాట సభ
 • ఇది రాజకీయ సభ కాదు
 • నీళ్లు లేకపోతే మనకు బతుకులేదు
 • పక్షిలా తీరుక్కుంటూ రాష్ట్ర మొత్తానికి చెబుతూనే ఉన్నా
 • నీరు లేకపోతే తెలంగాణ లేదు
 • ఫ్లోరైడ్‌ సమస్యను ఎవరూ పట్టించుకోలేదు
 • ఫ్లోరైడ్‌ను శాశ్వతంగా పరిష్కరించింది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే
 • మనం ఉద్యమించకపోతే మనల్ని రక్షించేందుకు ఎవరూ రారు
 • నల్లగొండ సభ తెలంగాణ వ్యతిరేకులకు ఓ హెచ్చరిక

 • నిమిషం కూడా కరెంట్‌ పోకుండా మనం సప్లయ్‌ చేశాం
 • పాలిచ్చే బర్రెను అమ్మేసి దున్నపోతును తెచ్చుకున్నారు
 • ఉమ్మడి రాష్ట్రమే బాగుండే అని ఇప్పటి పాలకులు అంటున్నారు
 • ఉమ్మడి రాష్ట్రమే బాగుంటే అంత పెద్ద ఉద్యమం ఎందుకు జరిగింది
 • శ్రీకాంతాచారి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు
 • తెలంగాణకు అన్యాయం జరిగితే నా కట్టేకాలే వరకు పులిలా కొట్లాడుతా
 • పిల్లిలాగా సైలెంట్‌గా ఉండను
 • అవసరమైతే పిడికిలి బిగించాలి
 • కేసీఆర్‌ సర్కారు పోగానే కరెంటు ఎటు పోయింది
 • చేతగాని చవటలు, దద్దమ్మల రాజ్యం ఉంటే ఇలాగే ఉంటుంది
 • అదనపు కరెంట్‌ ఉన్నా 24 గంటలు ఎందుకు ఇవ్వడంలేదు
 • మీకు తెలివిలేక, నడపరాక, చేతకాక కరెంట్‌ పోతోంది

 • 3 కోట్ల టన్నుల వడ్డు పండించిన తెలంగాణకు ఏం బీమారి వచ్చింది
 • రైతుబంధు ఇవ్వడానికి ఏం రోగం వచ్చింది
 • రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతామంటున్నారు
 • పంటలు పండించే రైతులకు కూడా చెప్పులు ఉంటాయి
 • రైతుల చెప్పులు బందోబస్తుగా ఉంటాయ
 • కేసీఆర్‌ను తెలంగాణలో తిరగనీయమనేంత మొనగాళ్లా?

 • కేసీఆర్‌ను బద్నాం చేయాలనే దుష్టబుద్ధితో రైతులను ఎండబెడతారా?
 • కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఆటబొమ్మ కాదు
 • మేడిగడ్డ, బొందల గడ్డ పోతారట
 • మేడిగడ్డ పోయి ఏం పీకుతారు
 • దమ్ముంటే నీళ్లు ఎత్తిపోయాలి
 • మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోతే బాగు చేయించి నీళ్లు ఇవ్వాలి
 • నాగార్జున సాగర్‌కుంగలేదా?
 • కడెం ప్రాజెక్టు, మూసీ ప్రాజెక్టులకు ఇబ్బందులు రాలేదా?

 • అసెంబ్లీలో తీర్మానంతో అయిపోదు
 • బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌లో న్యాయమైన వాటా తేలేవరకూ కొట్లాడాలి
 • నేను వచ్చింది రాజకీయాల కోసం కాదు..హక్కుల మీద పోరాటానికి సిద్ధంగా లేకపోతే నష్టపోతాం
 • కరెంట్‌ ఇప్పుడే లేకపోతే ముందు ముందు ఇంకా ఇస్తరా
 • రైతు బంధు బ్యాంకుల్లో పడటం లేదు.. ఫోన్లు మోగడంలేదు
 • అధికారం కోసం నోటికొచ్చినట్లు హామీలు ఇచ్చారు
 • దొంగ, నంగనాచి మాటలతో తప్పించుకుంటే నడవదు
 • మీరేం బాధపడకండి, మళ్లీ మనమే వస్తాం
 • కృష్ణా, గోదావరి జలాల్లో సంపూర్ణమైన వాటావచ్చే వరకూ పోరాడుతాం

 • నల్గొండలో బీఆర్‌ బహిరంగ సభ
 • సభా ప్రాంగణానికి చేరుకున్న మాజీ సీఎం కేసీఆర్‌
 • అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్‌ఎస్‌ తొలి బహిరంగ సభ

► నల్గొండ జిల్లా వీటీ కాలనీలో ఉద్రిక్తత నెలకొంది. సభకు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల బస్సుపై దాడి జరిగింది. బస్సుపైకి కోడిగుడ్లు విసిరి ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. నల్లచొక్కాలు ధరించి ‘గోబ్యాక్‌ గోబ్యాక్‌’ అంటూ నినాదాలు చేశారు. బస్సులో మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావు ఉన్నారు. ఎన్‌ఎస్‌యూఐ నేతలను అరెస్ట్‌ చేసిన పోలీసులు.. వారిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. 

సాక్షి, నల్గొండ: కృష్ణా నది ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ తలపెట్టిన చలో నల్లగొండ బహిరంగ సభకు మాజీ సీఎం కేసీఆర్‌ బయల్దేరారు. సాయంత్రం 4 గంటలకు నిర్వహించే ఈ బహిరంగసభలో కేసీఆర్‌ ప్రసంగించనున్నారు. నల్లగొండ పట్టణ శివారులో నార్కట్‌పల్లి-అద్దంకి హైవేకు అనుకుని మర్రిగూడ బైపాస్‌లో విశాలమైన స్థలంలో నిర్వహించే బీఆర్‌ఎస్‌ సభకు ఇప్పటికే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, శ్రేణులు భారీగా చేరుకున్నారు.

నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు, రైతులు తరలివస్తున్నారు. నల్లగొండతోపాటు ఇతర జిల్లాల నుంచి కూడా ప్రజలు తరలిరానుండటంతో సభా ప్రాంగణానికి నలువైపులా జనం చేరుకునేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాహనాల పార్కింగ్‌ కోసం అన్ని వైపులా ప్రత్యేక స్థలాలను సిద్ధం చేశారు. మరోవైపు సభకు పోలీసు శాఖ 500 మంది సిబ్బందితో బందోబస్తు చేపట్టింది.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తొలిసారి జనంలోకి అడుగుపెడుతుండటంతో ఈ సభపై ఉత్కంఠ నెలకొంది. ఇక్కడి నుంచి బీఆర్‌ఎస్‌ లోక్‌సభ ఎన్నికల శంఖారావం పూరించనుంది. అయితే కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టులు అప్పగింత విషయంలో రాష్ట్ర ప్రభు త్వం సోమవారం అసెంబ్లీలో తీర్మానం చేసిన నేపథ్యంలో కేసీఆర్‌ నల్లగొండ సభలో తన ప్రసంగ శైలిని మార్చే అవకాశముంది. 6 నెలల్లోగా నదీ జలాల పంపకం పూర్తి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నల్లగొండ సభావేదికగా కేసీఆర్‌ అల్టిమేటం జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. 

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega