లోక్‌సభ ఎన్నికల వేళ.. బీఎస్పీకి షాక్‌

25 Feb, 2024 12:13 IST|Sakshi

లక్నో: బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీ(బీఎస్పీ) ఎంపీ రితేష్‌ పాండే బీఎస్పీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. మామావతి నేతృత్వంలోని బీఎస్పీ పార్టీకి రాజీనామా చేసినట్లు ఎంపీ రితేష్‌ పాండే.. ఆదివారం సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. ఆయన ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్‌నగర్‌ నుంచి లోక్‌సభ బీఎస్పీ ఎంపీగా ప్రాతినిధ్యం వస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయన బీఎస్పీ రాజీనామా చేయటంతో బీజేపీలో చేరుతారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.

ఉత్తరప్రదేశ్‌ లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో సహకరించిన బీఎస్పీ పార్టీ   నేతలు,కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ‘చాలా కాలంగా నాకు పార్టీలో ఎటువంటి గుర్తింపు లభించటం లేదు. పార్టీ సమావేశాల్లో కూడా నాకు సీనియర్‌ నేతలు తగిన ప్రాధాన్యత ఇవ్వటం లేదు. అయనా.. నా నియోజకర్గం ప్రజలు, పార్టీ కార్యకర్తలతో సమావేశం అవుతూ  ఉన్నా. ఇక పార్టీని నా సేవలు అవసరం లేదని భావిస్తున్నా. అందుకే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా’ అని ఎంపీ రితేష్‌ పాండే  తెలిపారు.

మరోవైపు ఎంపీ రితేష్‌ పాండే బీజేపీ చేరుతారని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. 10 రోజుల క్రితం ప్రధాన మంత్రి నరేంద్రమోదీని కలిసిన పాండే.. ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో మోదీని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. దీంతో ఆయన బీజేపీలో చేరుతారని చర్చ జరుగుతోంది.

బీజేపీలో చేరిన రితేష్‌ పాండే
బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్సీ)కి రాజీనామా చేసిన అంబేద్కర్‌ నగర్ లోక్‌సభ నియోజకవర్గ ఎంపీ రితేష్ పాండే ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ సమక్షంలో బీజేపీలో చేరారు.

whatsapp channel

మరిన్ని వార్తలు