మునుగోడు ప్రజలు రాజగోపాల్‌రెడ్డికి బుద్ధి చెబుతారు.. ఉప ఎన్నికల్లో పోటీకి సిద్ధం

5 Aug, 2022 08:15 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నామని బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ వెల్లడించారు. మునుగోడు ప్రజలు రాజగోపాల్‌రెడ్డికి బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు.  రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో అన్ని స్థానాల్లోనూ బీఎస్పీ ఒంటరిగా పోటీ చేస్తుందని, బీఎస్పీ గెలుపు చారిత్రక అవసరమన్నారు. సామాజిక న్యాయం అజెండాగా ఉప ఎన్నికల్లోకి వెళ్తామని ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు.

నాలుగు రాష్ట్రాలకు చెందిన పార్టీ నేతలతో బీఎస్పీ అధినేత్రి మాయావతి గురువారం ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ప్రవీణ్‌ కుమార్‌ అనంతరం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.  రాష్ట్రంలోని సమస్యలను తప్పించుకోవడానికి కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీలు నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు.
చదవండి: కాంగ్రెస్ గూటికి చెరుకు సుధాకర్‌.. మునుగోడు ఉపఎన్నికలో సామాజిక అస్త్రంగా!

మరిన్ని వార్తలు