'కాంట్రాక్టుల కోసం పోలవరాన్ని పట్టించుకోలేదు'

23 Oct, 2020 18:21 IST|Sakshi

ఢిల్లీ : ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి శుక్రవారం కేంద్ర మంత్రి నిర‍్మలా సీతారామన్‌తో భేటీ అయి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలపై చర్చించారు. అనంతరం బుగ్గన మీడియాతో మాట్లాడారు.' పోలవరం విషయంలో చంద్రబాబు తప్పుల వల్ల రాష్ట్రానికి అన్యాయం జరిగింది. 2016లో ప్రత్యేక ప్యాకేజీ పేరుతో 2014 నాటి ఖర్చులకు..చంద్రబాబు ప్రభుత్వం పోలవరం ఒప్పందం చేసుకుంది. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నారు.చంద్రబాబు ప్రభుత్వం మిడ్‌నైట్ డీల్ కుదుర్చుకుంది. ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా 2014 నాటి ఖర్చులు ఇస్తే సరిపోతుందన్నారు. పునరావాసం, భూసేకరణ ఖర్చు, ప్రాజెక్ట్ నిర్మాణం ఖర్చు పెరిగే అవకాశం ఉందన్న కేబినెట్ తీర్మానం కూడా పక్కన పెట్టారు.ఈ అంశాన్ని గతంలోనే వైఎస్‌ జగన్ ప్రతిపక్ష నేతగా ప్రశ్నించారు.(చదవండి : 'అక్కడ ఎనిమిదో వింత ఉన్నట్లుగా ఫీలవుతున్నారు')

నాడు పట్టిసీమ పేరుతో పోలవరం ప్రాజెక్టు ఏడాదిన్నర ఆలస్యం చేశారు. కేంద్ర ప్రభుత్వమే నిర్మాణం చేపడితే కాంట్రాక్టులు దక్కవని చంద్రబాబు ప్రభుత్వం ఇలా ప్రవర్తించింది. రాష్ట్ర ప్రభుత్వం  చేసిన ఖర్చును సీడబ్ల్యూసీ ద్వారా కన్ఫర్మ్ చేయాలని చంద్రబాబు  ప్రధానికి  లేఖ రాశారు. బాబు రాష్ట్రానికి  తీరని అన్యాయం చేశారు . పోలవరం కట్టాలనే ఆలోచన టీడీపీకి లేదు.. కాంట్రాక్టుల కోసమే ఇలాంటి ఒప్పందాలు చేసుకున్నారు.గత టీడీపీ ప్రభుత్వం సొంత కాంట్రాక్టుల కోసం సంవత్సరన్నర కాలం పాటు పోలవరాన్ని పట్టించుకున్న పాపానపోలేదు. గత టీడీపీ పాలన వల్ల రాష్ట్రం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోంది.

2016వ సంవత్సరంలో 2014 ఖర్చుకు పరిమితం కావాలని ఒప్పుకోవడం సరికాదు. మా ప్రభుత్వంలో పోలవరం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అంచనాలు  రివైజ్డ్  చేస్తున్న సమయంలో టీడీపీ ప్రభుత్వ బండారం బయటపడింది.పోలవరం ఇప్పటికీ జాతీయ ప్రాజెక్టుగానే పరిగణిస్తున్నాం. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఎగ్జిక్యూటివ్ అధారిటీ మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన నిధులను కండిషన్స్ లేకుండా రీయింబర్స్‌ చేసి త్వరితగతిన విడుదల చేయాలి. భూసేకరణ, పునరావాసం తదితర అంశాలను వేరుగా చూడాలి. ఈ సమస్యకు తగిన  మార్గం చూపించాలి.  ప్రాజెక్టు నిర్మాణం ప్రతిష్టాత్మకంగా జరుగుతోంది' అని బుగ్గన మీడియాకు వెల్లడించారు. (చదవండి : పండుగ వేళ ఉద్యోగులకు సీఎం జగన్‌ తీపి కబురు)

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు