సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు

5 Feb, 2024 20:35 IST|Sakshi

మంచిర్యాల, సాక్షి: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్‌ఎస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క​ సుమన్‌పై కేసు నమోదు అయ్యింది. కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు మంచిర్యాల పోలీసులు . 

సోమవారం మంచిర్యాల జిల్లా బీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశంలో బాల్క సుమన్‌, సీఎం రేవంత్‌రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ను ఉద్దేశించి సీఎం హోదాలో రేవంత్‌ అనుచితంగా మాట్లాడారని అంటూనే.. ఈ క్రమంలో సీఎం రేవంత్‌పై బూతు పదజాలం వాడారు బాల్క సుమన్‌. ఆ సమయంలో కార్యకర్తలు విజిల్స్‌ వేయడంతో.. సుమన్‌ ఊగిపోయారు. 

అంతేకాదు.. రేవంత్‌ను చెప్పుతో కొడతానంటూ ఆగ్రహంతో వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ వెంటనే సంస్కారం అడ్డువస్తోందంటూ సర్దిచెప్పుకునే యత్నం చేశారాయన. ఆ ప్రసంగం వీడియో వైరల్‌ కావడంతో.. కాంగ్రెస్‌ నేతలు పోలీసులను ఆశ్రయించారు. దీంతో బాల్క సుమన్‌పై సెక్షన్లు 294బీ, 504, 506 సెక్షన్లపై కేసు నమోదైనట్లు సమాచారం.

👉: బాల్క్‌ సుమన్‌పై ఎఫ్‌ఐఆర్‌

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega