2023 వరకు సీఎం మార్పు ఉండదు: కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషి

6 Dec, 2021 08:20 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న ప్రహ్లాద్‌జోషి

సాక్షి, హుబ్లీ(కర్ణాటక): రాష్ట్రంలో 2023 వరకు సీఎం మార్పు ఉండదని, ముఖ్యమంత్రిగా బొమ్మై కొనసాగుతారని కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషి తెలిపారు. హుబ్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... మంత్రి ఈశ్వరప్ప సీఎం మార్పు వ్యాఖ్యలు చేయడం తప్పన్నారు.

అదే విధంగా ప్రధాని మోదీ, మాజీ ప్రధాని దేవెగౌడల కలయిక సాధారణమేనని, హాసన్‌ ఐఐటీ తదితర విషయాలపై మాట్లాడారని అన్నారు. పొత్తు విషయం తనకు తెలియదన్నారు. 

మరిన్ని వార్తలు