కర్ణాటక కొత్త సీఎం ఎంపికపై కొనసాగుతున్న ఉత్కంఠ

27 Jul, 2021 12:21 IST|Sakshi

బెంగళూరు: కర్ణాటక కొత్త సీఎం ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. యడియూరప్ప కర్ణాటక సీఎం పదవికి రాజీనామా చేయడంతో కొత్త సీఎం ఎంపిక అనివార్యమైంది. దీనిపై బీజేపీ అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తోంది. బి.ఎస్‌.యడియూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సోమవారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. కొత్త సీఎం అభ్యర్థిని ఎంపిక చేసేందుకు బీజేపీ అధిష్టానం చర్యలు ప్రారంభించింది.  సీఎం ఎంపికకు పరిశీలకులుగా కేంద్ర మంత్రులు ధర్మేం‍ద్ర ప్రధాన్‌, కిషన్‌ రెడ్డిలను నియమించింది. 

ఇప్పటికే కేంద్ర మంత్రి ధర్మేం‍ద్ర ప్రధాన్‌ బెంగళూరుకు చేరుకోగా, కిషన్‌ రెడ్డి కూడా బెంగళూరుకు బయల్దేరి వెళ్లారు. అయితే, సీఎం రేసులో ప్రహ్లద్‌ జోషి, సీటీ రవి, ముర్గేష్ నిరాణి, బసవరాజ్‌లు తదితరులు ఉన్నారు. అయితే, కేంద్ర మంత్రులిద్దరు కలిసి సాయంత్రం 5 గంటలకు కర్ణాటక కొత్త సీఎంను ఖరారు చేయనున్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు