ఇది నిరుద్యోగుల వ్యతిరేక ప్రభుత్వం

31 Jul, 2020 03:18 IST|Sakshi

ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌ విమర్శ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రప్రభుత్వం కొత్త ఉద్యోగాలు కల్పించే బాధ్యతను వదిలేసి.. ఉన్న ఉద్యోగాలు తొలగిస్తోందని, ఇది నిరుద్యోగుల వ్యతిరేక ప్రభుత్వమని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీ చంద్‌రెడ్డి విమర్శించారు. గత 15 ఏళ్లుగా గ్రామాల్లో ఉపాధి హామీలో భాగంగా కోట్లాది మందికి పనులు కల్పించిన దాదాపు 7,700 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లను తొలగించడాన్ని ఆయన గురువారం ఓ ప్రకటనలో తప్పుపట్టారు. ఫీల్డ్‌ అసిస్టెంట్ల పనికూడా అప్పజెప్పి ఇప్పటికే తీవ్ర పని ఒత్తిడికి లోనవుతున్న పంచాయతీ కార్యదర్శులపై మరింత పని భారం మోపడం ప్రభుత్వం చేస్తున్న శ్రమదోపిడీగా వంశీచంద్‌ అభివర్ణించారు. అన్యాయంగా తొలగించిన  ఫీల్డ్‌ అసిస్టెంట్లను వెంటనే పునర్నియమించాలని, పంచాయతీ, జూనియర్‌ పం చాయతీ కార్యదర్శులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు