పోతిరెడ్డిపాడుపై బహిరంగ చర్చకు సిద్ధమా?

9 Aug, 2020 02:03 IST|Sakshi

టీఆర్‌ఎస్‌ నేతలకు ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి సవాల్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్‌రెడ్డి ఆరోపించారు. ఈ విషయంపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని టీఆర్‌ఎస్‌ నాయకులకు ఆయన సవాల్‌ విసిరారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థతను, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో చేసిన పొరపాట్లను కప్పిపుచ్చుకునేందుకే అసంబద్ధ, అవాస్తవ వాదనను టీఆర్‌ఎస్‌ నేతలు ముందుకు తెస్తున్నారని శనివారం ఓ ప్రకటనలో విమర్శించారు. దీనిపై బహిరంగ చర్చకు ప్రత్యక్షంగానైనా, వర్చువల్‌ జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారానైనా సిద్ధమేనని తెలిపారు. సీఎం కేసీఆర్‌ కాంట్రాక్టర్లకు ప్రతినిధిగా వ్యవహరిస్తున్న తీరును బహిర్గతం చేసి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెడతానని ఆ ప్రకటనలో వంశీ పేర్కొన్నారు.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా