ఏపీ అసెంబ్లీ సమావేశాలు: మొహం చాటేసిన చంద్రబాబు

18 May, 2021 18:06 IST|Sakshi

అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకూడదని టీడీఎల్పీలో నిర్ణయం

సాక్షి, అమరావతి: అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు ప్రతిపక్ష నేత చంద్రబాబు మొహం చాటేశారు. ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ సమావేశాలకు హాజరుకాకూడదని టీడీఎల్పీలో నిర్ణయించినట్లు తెలిసింది. కరోనా నేపథ్యంలో హైదరాబాద్‌కే పరిమితం కావాలనే యోచనలో చంద్రబాబు, లోకేష్‌ ఉన్నట్లు సమాచారం. అసెంబ్లీ వేదికగా టీడీపీ అవినీతి, అన్యాయాలను ప్రభుత్వం నిలదీస్తుందనే ఆందోళనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. రఘురామకృష్ణరాజు వ్యవహారంపై సభలో అధికారపక్షం నిలదీస్తుందని బాబు ఆందోళన చెందుతున్నారట. ఎన్‌440కే వైరస్‌ విష ప్రచారంపై సమాధానం చెప్పాల్సి వస్తుందనే భావనలో చంద్రబాబు ఉన్నట్లు తెలిసింది.

20న అసెంబ్లీ, మండలి సమావేశాలు
పూర్తి స్థాయి రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు 20వ తేదీన అసెంబ్లీతో పాటు శాసన మండలి సమావేశం కానుంది. ఆ రోజు ఉదయం 9 గంటలకు రెండు చోట్లా సమావేశం ప్రారంభమవుతుంది. కోవిడ్‌–19 ఉధృతి, వ్యాక్సినేషన్‌ నేపథ్యంలో ఈ సమావేశాలను ఒక రోజుకే పరిమితం చేయాలా? లేదా మరి కొన్ని రోజులు నిర్వహించాలా అనే విషయంపై శాసన సభా వ్యవహారాల సలహా కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.

చదవండి: పారని టీడీపీ పాచిక
అసలు కుట్ర బయటపడకుండా పక్కదోవ పట్టించేందుకే?!

మరిన్ని వార్తలు